Sunil : కమెడియన్ సునీల్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో అలరించాడు. వందల సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే సునీల్ ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు హీరోగా చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా, కీలక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా మొన్న గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నటి దివికి భర్తగా చేశాడు. వాస్తవంగా ఇద్దరి నడుమ ఏజ్ గ్యాప్ చాలా ఉంది. కానీ డైరెక్టర్ ఇద్దరికి జోడీ పెట్టాడు. అయితే బయట కూడా సునీల్ ఆమెతో ఇలాంటి రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడంటూ ఈ మధ్య ఇలాంటి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.
సునీల్ ఆమెతో డేటింగ్ కోరుకుంటున్నాడు అంటూ చెబుతున్నారు. అయితే ఈ రూమర్లపై సునీల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క రూమర్ కూడా లేని సునీల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కొందరు పుట్టిస్తున్న రూమర్లు ఇవి అంటూ ఫైర్ అవుతున్నారు.
చెత్త రూమర్లకు ధీటుగా సునీల్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Also : Sreeleela : శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కుందా.. కోరిక తీర్చమన్న స్టార్ డైరెక్టర్..!
Read Also : Sudigali Sudheer : మల్లెమాలకు సుధీర్ రీ ఎంట్రీని అడ్డుకుంటున్న కమెడియన్.. ఎంత కుట్ర చేశాడు..?