S. S. Rajamouli : రాజమౌళి నటించిన ఆ సినిమా ఫ్లాప్.. అదేంటో తెలుసా?

S. S. Rajamouli : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన కెరీర్‌లో చేసిని సినిమాలన్నీ కూడా విజయాలే. అపజయం ఎరుగని ధీరుడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.. తన సినిమాలను ఎప్పటికప్పుడు అత్యద్భుతమైన శిల్పాలుగా చెక్కుతుంటాడు. ఆయన తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 1920 ల నాటి ఫిక్షనల్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్స్ కొమురం భీం, అల్లూరి సీతారామారాజు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ […].

By: jyothi

Published Date - Wed - 17 November 21

S. S. Rajamouli : రాజమౌళి నటించిన ఆ సినిమా ఫ్లాప్.. అదేంటో తెలుసా?

S. S. Rajamouli : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన కెరీర్‌లో చేసిని సినిమాలన్నీ కూడా విజయాలే. అపజయం ఎరుగని ధీరుడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.. తన సినిమాలను ఎప్పటికప్పుడు అత్యద్భుతమైన శిల్పాలుగా చెక్కుతుంటాడు. ఆయన తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

1920 ల నాటి ఫిక్షనల్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్స్ కొమురం భీం, అల్లూరి సీతారామారాజు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. రాజమౌళి నటుడిగా ఓ సినిమాలో నటించారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

S.S.Rajamouli

S.S.Rajamouli

‘బాహుబలి’ పార్ట్-1 ‘ద బిగినింగ్‌’లో రాజమౌళి ఓ పాటకు ముందర నటుడిగా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. కాగా, అంతకు ముందర ఓ సినిమాలో ఓ పాత్ర పోషించాడు రాజమౌళి. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘రెయిన్ బో ’ సినిమాలో రాజమౌళి నటించారు. రాజమౌళి తన కోరిక మేరకు ఆ సినిమాలో ఓ పాత్ర పోషించాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ఆదిత్య. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ‘రెయిన్ బో’ సినిమా వలన తాను చాలా డబ్బు లాస్ అయ్యానని ఆదిత్య చెప్పుకొచ్చారు.

rajamouli 22

rajamouli 22

‘రెయిన్ బో’ ఫిల్మ్‌లో నటించాలని తాను అడిగినందుకే రాజమౌళి, కోడి రామకృష్ణ నటించారని వివరించారు ఆదిత్య. రాజమౌళి కంటే ముందర చాలా మంది దర్శకులు వెండితెరపైన నటులుగాను వెలుగొందారు. దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకుడిగానే కాకుండా నటుడిగాను వెండితెరపైన వెలుగొందారు. ఇకపోతే ఇటీవల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రారావు కూడా సిల్వర్ స్క్రీన్‌పైన మెరిశాడు. పూరీ జగన్నాథ్ సైతం పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు.

raja mouli

raja mouli

ఇకపోతే బయట నుంచి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన రైటర్ కమ్ డైరెక్టర్స్‌లో ఒకరు వీఎన్ఆదిత్య. ఉదయ్ కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో తీసిన ‘నేనున్నాను’ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ ఆదిత్య అంత సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆదిత్య ‘లవ్ ఎట్ 65, మర్యాద కృష్ణయ్య’ అనే చిత్రాలను తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Tags

Related News