Sai Dharam Tej : మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ నార్మల్ పొజీషన్ కు చేరుకున్నాడు. దాంతో మళ్లీ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.
ఇక తాజాగా ఆయన నటించిన మూవీ విరూపాక్ష. దీనికి సుకుమార్ డైరెక్షన్ చేశారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు.
తాజాగా సాయిధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లవ్ ఎఫైర్ గురించి స్పందించాడు. నాకు కూడా గతంలో ఓ లవ్ ట్రాక్ ఉండేది. నేను గతంలో ఓ అమ్మాయిని చాలా ఘాడంగా ప్రేమించాను. కానీ ఆమెతో నాకు బ్రేకప్ అయింది. అప్పటి నుంచి అమ్మాయిలంటేనే నాకు భయం వేస్తోంది.
అప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. ఇక పెండ్లి విషయంలో కూడా నా ఇష్టమే. నేను ఎప్పుడు చేసుకోవలనుకుంటే అప్పుడు చేసుకుంటాను. అంతే తప్ప ఎవరో చెబితే నేను చేసుకోను అంటూ చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. ఆయనకు గతంలో రెజీనా, రాశిఖన్నాతో కూడా లవ్ ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Read Also : Sri Reddy : మెగా హీరోలంతా డమ్మీగాళ్లే.. శ్రీరెడ్డి దుమారం రేపే కామెంట్లు..!
Read Also : Venkatesh Daggubati : వెంకటేశ్ కు చాలా ఎఫైర్లు ఉన్నాయి.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!