Sai Pallavi : సాయిపల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ఉంది. ఎందుకంటే ఆమెకు ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది మరి. సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్లకు లేనంత ఫాలోయింగ్ కేవలం ఆమెకు మాత్రమే సొంతం. ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకున్నా.. ఎలాంటి రొమాంటిక్ సీన్లలో నటించకున్నా.. ఇంతటి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
పైగా సినిమాలో పింపుల్స్ తో కనిపించేంత ధైర్యం ఉన్న ఏకైక హీరోయిన్ కూడా ఆమెనే. ఆమెకు పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తుంది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే తనకు పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసింది.
అమ్మాయిలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై సాయిపల్లవి స్పందించింది. నేను కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కున్నాను. నా చిన్న వయసులో నేను గ్రౌండ్ కు వెళ్లి ఆడుకునే దాన్ని. నాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు గ్రౌండ్ లో షటిల్ ఆడేందుకు వెళ్లాను. అక్కడ కోచ్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. నా దగ్గరకు వచ్చి నేను నేర్పిస్తాను అంటూ అన్నాడు.
కావాలనే మీద చేతులు వేసి నొక్కాడు. దాంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే ఏడవాలని అనిపించింది. నేను వదిలిపెట్టండి అంటూ అరిచేసరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరోసారి ఆ గ్రౌండ్ కు నేను వెళ్లలేదు. ఆ తర్వాత ఎప్పుడూ నాకు అలాంటి అనుభవం ఎదురు కాలేదు అంటూ తెలిపింది సాయిపల్లవి.
Read Also : Karthi : హీరో సూర్యకు పొగరెక్కువ.. నన్ను దూరం పెట్టేవాడు.. కార్తీ సంచలనం..!
Read Also : Jeevitha Rajasekhar : రూమ్ కు రమ్మని ఇబ్బంది పెట్టాడు.. జీవిత రాజశేఖర్ సంచలన ఆరోపణలు..!