Sai Pallavi : సాయిపల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఇప్పటి వరకు ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకుండానే భారీ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఈ జనరేషన్ లో మేకప్ లేకుండా అది కూడా మొటిమలతో నటించి సక్సెస్ అందుకున్న ఏకైక హీరోయిన్ ఆమెనే అని చెప్పుకోవాలి.
అయితే ఇప్పటి వరకు సాయిపల్లవిపై లవ్ ఎఫైర్ రూమర్లు అయితే రాలేదు. ఇందుకు ఆమె నడుచుకుంటున్న విధానమే కారణం అని చెప్పుకోవాలి. కాగా సాయిపల్లవి కూడా లవ్ లో పడిందనే విషయం చాలామందికి తెలియదు. ఆమె ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
నేను స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. అయితే ఆయనకు నా లవ్ మ్యాటర్ చెప్పే ధైర్యం నాకు లేదు. దాంతో ఓ లవ్ లెటర్ రాసి ఆ విషయాన్ని ఆయనకు చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ లెటర్ ను ఆయనకు ఇచ్చే ధైర్యం లేక నా బ్యాగ్ లో పెట్టుకున్నాను. ఓ రోజు మా అమ్మ ఆ లెటర్ ను చూసి నన్ను చితక్కొట్టింది.
అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి లవ్ లో అయితే పడలేదు. నా సినిమాల్లో కూడా నా మీద ఎలాంటి రూమర్లు రానందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది. ప్రస్తుతం మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అంటూ అప్పట్లో తెలిపింది.
Read Also : Custody Movie : ప్లాప్ మూవీ కస్టడీని రిజెక్ట్ చేసిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Read Also : Balagam Movie : బలగం సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా.. ఇది కదా జాక్ పాట్..!