Sai Dharam Tej : ఆమెకు ఐలవ్ యూ చెబితే అన్నయ్య అనేసింది.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్

Sai Dharam Tej  : సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా మెగా, పవర్ స్టార్ అభిమానుల ఆశీస్సులు మనోడికి బాగానే ఉన్నాయి. .

By: jyothi

Published Date - Thu - 22 September 22

Sai Dharam Tej  : ఆమెకు ఐలవ్ యూ చెబితే అన్నయ్య అనేసింది.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్

Sai Dharam Tej  : సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా మెగా, పవర్ స్టార్ అభిమానుల ఆశీస్సులు మనోడికి బాగానే ఉన్నాయి. దీనివల్లే సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా చెలామణి అవుతున్నాడు. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన సాయి.. చాలా తక్కువ టైంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి చర్చ జరుగుతుండగా.. ఓ ఇంటర్య్వూలో సుప్రీం హీరో కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

ప్రేమిస్తున్నాను అని చెబితే..

సాయిధరమ్ తేజ్ తన చిన్నతనంలో చాలా అవారాగా ఉండేవాడినని.. చదువులో చాలా పూర్ అని చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే తన జీవతం చాలా దారుణంగా ఉండేదన్నాడు. తాను సినిమాల్లో ఇపుడు ఇలా రాణిస్తున్నానంటే తన మామయ్యలు నాగబాబు, పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పుకొచ్చాడు. వారి ప్రోత్సాహం, నేర్పించిన క్రమశిక్షణ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పాడు.

ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రమాదం నుంచి బయట పడిన సుప్రీం హీరో.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వినోదయ సిత్తం అనే సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నాడట.. ఈ సీన్ సినిమాలో హైలెట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. చిన్నప్పుడు తను చేసిన చిలిపి పనుల గురించి వివరించాడు.

చదువుకునే రోజుల్లో తాను కాలేజీకి వెళ్లకపోతే టీచర్లు ఫీలయ్యేవారని తెలిపాడు. ఇక అప్పట్లో చాలా మంది అమ్మాయిలకు నేను ప్రపోజ్ చేశాను. కానీ ఏ ఒక్కరూ నాకు సెట్ అవ్వలేదు. నా ప్రేమ గుర్తులు అన్నీ హార్ట్ బ్రేకింగ్ గానే మిగిలాయి. ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు. చాలా మంది నన్ను స్నేహితుడిగా భావించారు. కొందరు బ్రదర్ అని పిలిచేవారు. ఒక రోజు ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెబితే నన్నుఅన్నయ్య అని పిలిచింది. దీంతో ఇక ఎవరికీ ఐ లవ్ యూ చెప్పలేదని పేర్కొన్నాడు.

Read Also :KCR And Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ ఒప్పందాన్ని రద్దు చేసిన కేసీఆర్?

Read Also : Suma kanakala-Rajiv kanakala : సుమ రాజీవ్‌‌ను దూరం పెట్టడానికి ఆ బోల్డ్ బ్యూటీనే కారణమా..?

Related News