Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆయన్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉంది సమంత. ఎప్పటికప్పుడు పరోక్షంగా చైతూను ఉద్దేశించే ఏదో ఒక కౌంటర్ వేస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్లు అక్కినేని ఫ్యాన్స్ కు మండేలా చేస్తున్నాయి. కానీ సమంత మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంది.
ఇప్పుడు నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్లలో ఆయన సమంత గురించి ఏదో ఒక కామెంట్ చేస్తున్నాడు. దాంతో సమంత కూడా రెచ్చిపోతూ ప్రతిగా కౌంటర్ పోస్టులు పెడుతోంది. ఆమె కావాలనే చైతూను టార్గెట్ చేస్తోందని అంటున్నారు చైతూ ఫ్యాన్స్. అయితే ఆమె గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కు అక్షయ్ కుమార్ తో కలిసి హాజరయింది సమంత. ఇందులో ఇప్పటి జనరేషన్ హీరోల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు హీరోలు అసలు ఏ ట్యాలెంట్ లేకపోయినా సినిమాలు చేస్తున్నారు.
సినిమాల్లో రాణించాలంటే అన్ని రకాల ట్యాలెంట్ ఉండాలి. అంతే తప్ప తమకు వచ్చినవే చేస్తాం అంటే జనాలు చూడరు కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈ కామెంట్లు కాస్తా చైతూ, అఖిల్ ను ఉద్దేశించే చేసిందనే విమర్శలు వచ్చాయి. వారు సక్సెస్ కావట్లేదు కాబట్టి ఇలా కౌంటర్ వేసిందని అప్పట్టో వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read : Ileana D’Cruz : టాలీవుడ్ హీరోలే కమిట్ మెంట్ అడిగారు.. ఇలియానా షాకింగ్ కామెంట్లు..!
Also Read : Sai Pallavi : సాయిపల్లవి మెచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?