Samantha : ఈ నడుమ సమంత చేస్తున్న కామెంట్లు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఎదురు దెబ్బలు తగిలిన మనుషులు ఎలా మాట్లాడుతారో.. సమంత కూడా అచ్చం అలాగే మాట్లాడుతోంది. చైతూతో విడిపోయిన చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆమె తన మనసులోని మాటలను బయట పెడుతోంది. ఇప్పుడు ఆమె శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పుడు సమంత బాగా పాల్గొంటుంది. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో ఆమె చాలా ఎమోషనల్ కామెంట్లు కూడా చేస్తోంది. అయితే తాజాగా ఎమోషనల్ కామెంట్లు చేసింది ఈ బ్యూటీ.
ఆమె మాట్లాడుతూ.. శాకుంతలం మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ మెంట్ అయ్యాను. గుణశేఖర్ గారు అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించారు. త్రీడీలో ఈ మూవీ ట్రైలర్ ను చూసి షాక్ అయ్యాను. ఇక ఈ మధ్య నా పర్సనల్ లైఫ్ గురించి అందరూ అడుగుతున్నారు. నా పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అప్పుడు నేను చాలా దృఢంగా ఉన్నాను. నా లైఫ్ లో ఎదుర్కున్న పరిస్థితుల కారణంగా నా లైఫ్ నాశనం కావొద్దని అనుకున్నాను. అందుకు తగ్గట్టే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది సమంత. అంటే చైతూ కారణంగా తన లైఫ్ ఆగిపోవవద్దనే కారణంతో ఆమె విడాకులు తీసుకుందని ఇలా ఇన్ డైరెక్టుగా చెబుతోందన్నమాట.
Read Also : Pawan Kalyan And Alluarjun : పవన్ సినిమా ప్లాప్ అయితే పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఎందుకంత కోపం..?
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. స్టార్ హీరోలెవరూ పనికి రారుగా..!