sandalwood.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి హార్ట్ ఎటాక్‌.. ఇప్ప‌టి దాకా ఎంత‌మంది స్టార్లకు వ‌చ్చిందంటే..?

sandalwood.. సాండల్ వుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక మంది నటులు గుండెపోటుతో మనకు దూరమయ్యారు. వీరిలో సీనియర్ నటులే కాకుండా యంగ్ ఏజ్ నటులు కూడా అనేక మంది ఉంటున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ గా పిలవబడే పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతోనే మనకు దూరమయ్యారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అనేక మంది కన్నడ స్టార్లు గుండెపోటుకు బలయ్యారు. కన్నడ సీనియర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సత్యజిత్ ఇటీవల గుండెపోటుతో […].

By: jyothi

Updated On - Sat - 30 October 21

sandalwood.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి హార్ట్ ఎటాక్‌.. ఇప్ప‌టి దాకా ఎంత‌మంది స్టార్లకు వ‌చ్చిందంటే..?

sandalwood.. సాండల్ వుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక మంది నటులు గుండెపోటుతో మనకు దూరమయ్యారు. వీరిలో సీనియర్ నటులే కాకుండా యంగ్ ఏజ్ నటులు కూడా అనేక మంది ఉంటున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ గా పిలవబడే పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతోనే మనకు దూరమయ్యారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అనేక మంది కన్నడ స్టార్లు గుండెపోటుకు బలయ్యారు. కన్నడ సీనియర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సత్యజిత్ ఇటీవల గుండెపోటుతో మరణించారు.

అంతే కాకుండా లాస్ట్ ఇయర్ అనేక మంది ఆర్టిస్టులు కూడా గుండెపోటుతో మరణించడం విచారకరం. కన్నడ మెగాస్టార్ గా పిలవబడే విష్ణు వర్ధన్ తో పాటు కమెడియన్ మైకేల్ మధు, విలన్ కమ్ కమెడియన్ అయిన రాక్ లైన్ సుధాకర్ వంటి వారు అనేక మంది లాస్ట్ ఇయర్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. వీరందరూ గుండెపోటుతోనే మనకు దూరమయ్యారు.

కేవలం వీరు మాత్రమే కాకుండా గుండెపోటుతో మరణించిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కూడా గుండెపోటుకు గురయ్యారు. కానీ లక్కీగా శివరాజ్ కుమార్ వైద్యానికి కోలుకున్నారు. కానీ పునీత్ విషయంలో మాత్రం అలా జరగలేదు. పునీత్ చాలా యంగ్ ఏజ్ లోనే ఇలా గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ అనేక వర్కవుట్లు చేసే వారని అనేక మంది చెబుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన హెవీ వర్కవుట్లు కూడా ఆయనకు యంగ్ ఏజ్ లోనే ఇలా గుండెపోటు రావడానికి ఒక కారణమని అభిమానులు భావిస్తున్నారు.

sandalwood..

sandalwood..

పునీత్ రాజ్ కుమార్ హ్యుమానిటీ ఉన్న వ్యక్తి అని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఆయన సాయం చేశారని తెలుపుతున్నారు. ఎక్కడికైనా సరే పునీత్ కుటుంబం స్టార్ హోదాను విడిచి పెట్టి వెళ్లేదని అటువంటి పునీత్ కు ఇలా జరగడం చాలా బాధాకరమని అంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ చాలా తెలుగు సినిమాలను రిమేక్ చేశాడు.

రిమేక్ సినిమాలతో ఆయన మంచి హిట్లు అందుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా రంగప్రవేశం చేసినా కానీ ఆయన హీరోగా మారింది మాత్రం ఒక తెలుగు రిమేక్ సినిమాతోనే కావడం విశేషం. ఆయన రిమేక్ సినిమాలే కాకుండా స్ట్రెయిట్ సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి విజయం సాధించిన లిస్ట్ లో ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అనేక మంది తెలుగు సెలెబ్రెటీలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

Tags

Latest News

Related News