Samantha : సినీ సెలబ్రిటీలను మన దేశంలో ఎంతగా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. ఇక మన తెలుగులో అయితే ఓ రేంజ్ లో ఆరాధిస్తుంటారు. ఇప్పటికే చాలామంది అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్ల కోసం రక్తదానాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సమంత అభిమాని అదిరిపోయే పని చేశాడు.
సమంత రీసెంట్ గా వచ్చిన శాకుంతలం మూవీతో ప్లాప్ అందుకుంది. అయితే చాలామంది సమంత వల్లే సినిమా ప్లాప్ అయిందని తిడుతుంటే… ఆమె అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లాలోని ఆలపాడుకు చెందిన సందీప్ అనే యువకుడు సమంతకు వీరాభిమాని.
ఇక రెండు రోజుల్లో సమంత బర్త్ డే ఉండటంతో అతను తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. తన ఇంట్లోనే ఏకంగా సమంతకు విగ్రహం కట్టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు మాత్రం ఇంత పిచ్చేంటి.. కావాలంటే మీ తల్లిదండ్రులకు కట్టించుకో అంటూ చెబుతున్నారు. ఇక సందీప్ గతంలో సమంతకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు మొక్కులు కూడా చెల్లించుకున్నాడు.
Read Also : Akkineni Naga Chaitanya : కారులో ముద్దుపెడుతూ దొరికిపోయా.. చైతూ కామెంట్లు వైరల్..!
Read Also : SS Rajamouli And Prashanth Neel : రాజమౌళి, ప్రశాంత్ నీల్ అభిమానించే ఏకైక హీరో ఎవరో తెలుసా..?