Senior comedians : సీనియర్ కమెడియన్స్ వెండితెరపై ఎందుకు కనిపించడం లేదంటే?

Senior comedians  : టాలీవుడ్ ఎప్పుడు కామెడీకి పెద్ద పీట వేస్తుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న కామెడీ స్టఫ్ మరే ఇండస్ట్రీలో కూడా లేదంటే అతియసోక్తి కాదేమో. అంతగా మన తెలుగు ప్రేక్షకులు కామెడీని ఆదరిస్తారు. మన ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు కూడా మరే ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి. అప్పట్లో ఎంత మంది కమెడియన్లు ఉన్న కూడా ఎలాంటి బేధాలు లేకుండా కలిసి మెలిసి నటించేవారు. కానీ ఇప్పుడు అంత మంది కమెడియన్లు […].

By: jyothi

Published Date - Wed - 8 December 21

Senior comedians : సీనియర్ కమెడియన్స్ వెండితెరపై ఎందుకు కనిపించడం లేదంటే?

Senior comedians  : టాలీవుడ్ ఎప్పుడు కామెడీకి పెద్ద పీట వేస్తుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న కామెడీ స్టఫ్ మరే ఇండస్ట్రీలో కూడా లేదంటే అతియసోక్తి కాదేమో. అంతగా మన తెలుగు ప్రేక్షకులు కామెడీని ఆదరిస్తారు. మన ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు కూడా మరే ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి. అప్పట్లో ఎంత మంది కమెడియన్లు ఉన్న కూడా ఎలాంటి బేధాలు లేకుండా కలిసి మెలిసి నటించేవారు. కానీ ఇప్పుడు అంత మంది కమెడియన్లు కనిపించడం లేదు.


సీనియర్ కమెడియన్లు అయితే సినిమాల్లో కనిపించడమే మానేశారు. పాత వాళ్లలో అలీ తప్పించి ఎవ్వరు కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు. చాలా మంది అగ్ర కమెడియన్లు ఈ లోకం విడిచి వెళ్లగా మరికొంత మంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల సినిమాల్లో కనిపించడం లేదు. ఇంతకముందు మన ఇండస్ట్రీలోని కమెడియన్ లను చూసి పక్క ఇండస్ట్రీ ప్రజలు కుళ్ళుకునేవారు.


ఇప్పుడు పెద్ద పెద్ద కమెడియన్ లు కనిపించడం మానేయడంతో సినిమాల్లో కామెడీ శాతం కూడా తగ్గింది. కొత్త వాళ్ళు పాత వాళ్లంతా అలరించలేక పోతున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమెడియన్ లలో మూడు వరుసలో బ్రహ్మానందం ఉండేవారు. అయితే ఆయన ఇప్పుడు సినిమాల్లో కనిపించడమే మానేశారు. తన ఆరోగ్య కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.


senior comedians

senior comediansఇంకా సీనియర్ కమెడియన్ లలో కృష్ణ భగవాన్, వేణు మాధవ్, ధర్మవరపు, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాష్ రెడ్డి, కొండవలస, రఘుబాబు వంటి స్టార్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీరెవరూ కూడా సినిమాల్లో కనిపించడం లేదు. చనిపోయిన వారిని పక్కన పెడితే ఉన్నవారు కూడా సినిమాల్లో కనిపించక పోవడంతో తెలుగు సినిమాల్లో హాస్యం లేదనే చెప్పాలి. ఉన్న కూడా వీరు మెప్పించినంత వేరెవరు కూడా మెప్పించలేక పోతున్నారు.


 

ఇప్పుడు ప్రెసెంట్ కాస్త హాస్యం పండిస్తున్నారంటే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి వారు మాత్రమే. వీరు ఫామ్ లోకి వచ్చిన తర్వాత బ్రహ్మానందం కి అవకాశాలు లేకుండా పోయాయి. సీనియర్ డైరెక్టర్లు అయితే బ్రహ్మికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ యంగ్ డైరెక్టర్లు అయితే మొత్తమే మర్చిపోయారు. అంతగా బ్రహ్మి వెండితెరకు దూరమయ్యారు. ప్రెసెంట్ బ్రహ్మి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయంతే.. ఇక అలీ కూడా అంతగా సినిమాల్లో కనిపించడం లేదు. మొత్తానికి ఒకరిద్దరు మినహాయించి పెద్దగా ఎవ్వరు కూడా సీనియర్ కమెడియన్లు తెరపై కనిపించడం లేదు

Tags

Latest News

Related News