Venkatesh Daggubati : టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేశ్ కు ఎలాంటి క్లీన్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దగ్గుబాటి ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాడనే చెప్పుకోవాలి. ఆయన మీద మొదటి నుంచి ఎలాంటి విమర్శలు లేవు. క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోగా ఆయనకు పేరుంది. అంతే కాకుండా ఆయనకు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ఉంది.
అయితే రీసెంట్ గా ఆయన నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ తో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. ఇందులో చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉండటంతో రానా నాయుడు వెబ్ సిరీస్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంకటేశ్ ఇన్నాళ్లుగా కాపాడుకున్న ఇమేజ్ మొత్తం పోయిందంటూ చాలా కామెంట్లు వినిపించాయి.
అయితే తాజాగా ఈ విషయంపై సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ స్పందించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి అడగ్గా.. ఆయన మాట్లాడారు. వెంకటేశ్, రానా నిజ జీవితంలో కూడా ఏమీ పవిత్రులు కారు. వారికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి.
రానా తమ్ముడు అభిరామ్ ఓ బీ గ్రేడ్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు. పైగా ఇప్పటి జనరేషన్ కు ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లు మాత్రమే నచ్చుతున్నాయి. చూసే వారికి లేని నొప్పి మనకెందుకు అన్నట్టు ఆయన కాస్త వల్గర్ గానే మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Taapsee Pannu : హీరోలే కమిట్ మెంట్లు అడిగారు.. తాప్సీ కామెంట్లు వైరల్..!
Read Also : Samantha : ఆ హీరోకు రెండో భార్యగా సమంత.. మొత్తానికి చెప్పేసిందిగా..!