Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ తెలుగులో ట్యాలెంటెడ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఆయన చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దీని తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. కానీ రీసెంట్ గానే ఆయన వ్యక్తిగతంగా ఓ ఇంటివాడు కాబోతున్నట్టు తెలిపేశాడు.
ఆయన తాను ప్రేమించిన రక్షిత రెడ్డితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. గత జనవరిలో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు పెండ్లి పీటలు ఎక్కలేదు. త్వరలోనే పెండ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయన పెండ్లి డేట్ ప్రకటించలేదు.
నాలుగు నెలలు గడుస్తున్నా పెండ్లి డేట్ చెప్పకపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన పెండ్లి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందంట. ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడంట. అందుకే ఇంకా పెండ్లి చేసుకోవట్లేదని తెలుస్తోంది.
అందుకే శర్వానంద్ ఒప్పుకున్న సినిమాల షూటింగులు కూడా చేయట్లేదు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమా షూటింగులు కంప్లీట్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఆయన పెండ్లి ఉంటే అవకాశం ఉందంట. చూడాలి మరి ఆయన ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతాడో.
Read Also : Eesha Rebba : తెలుగు అమ్మాయిలు పడుకోరు.. ఈషారెబ్బా షాకింగ్ కామెంట్లు..!
Read Also : Samantha : చైతూను మళ్లీ టార్గెట్ చేసిన సమంత.. భగ్గుమంటున్న అక్కినేని ఫ్యాన్స్..!