Shruti Haasan : హీరోయిన్లకు హీరోల మీద క్రష్ ఉండటం అనేది చాలా కామన్. అయితే కొంత మంది హీరోయిన్లు తమ మనసులో మాటలను బయట పెడుతుంటారు. తమ మొదటి క్రష్ ఎవరనేది కూడా చెప్పేస్తారు. ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా అలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఇప్పుడు ముంబైలో ఉంటుంది.
మొన్నటి వరకు సౌత్ లో యంగ్, స్టార్ హీరోయిన్లతో చేసిన ఆమెకు ఇప్పుడు యంగ్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె సీనియర్ హీరోలతో నటిస్తోంది. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ఆమె మంచి హిట్ కూడా అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా శృతిహాసన్ ముంబైలో తన ప్రియుడితో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే.
అతనితో ఒకే ఇంట్లో..
తన ప్రియుడు శాంతాను హజారికతో కలిసి ఆమె ఒకే ఇంట్లో సహజీవనం చేస్తోంది. ఆమె గతంలో కూడా చాలామందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ పెండ్లి చేసుకోలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గింది. నీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగ్గా ఏ మాత్రం మొహమాటం పడకుండా చెప్పేసింది శృతిహాసన్.
నాకు హాలీవుడ్ స్టార్ హీరో బ్రూస్ లీ అంటే చాలా ఇష్టం. అతినితో డేటింగ్ చేయాలని అప్పట్లో అనుకున్నాను అంటూ తెలిపింది. దాంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. నీకు ఎంత మంది ఉన్నా సరిపోరా తల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకేముంది ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు.
Read Also : Dasara Movie : దసరా సినిమాను వదులుకున్న స్టార్ హీరో.. దురదృష్టం అంటే ఇదే..!
Read Also : Samantha : చైతూ-శోభిత డేటింగ్ మీద మొదటిసారి స్పందించిన సమంత..!