Shweta Agarwal: ‘అల్లరి’ హీరోయిన్ శ్వేత అగర్వాల్ ఇప్పుడేం చేస్తోందంటే..

Shweta Agarwal: అల్లరి నరేష్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా అది. అందుకే, ‘అల్లరి’ కాస్తా నరేష్ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు రవిబాబు. రవిబాబు ఇంటి పేరు కూడా ‘అల్లరి’గానే మారిపోయింది. అంతే కాదు, ఈ సినిమాలో చాలామంది నటీనటుల పేర్ల ముందు ‘అల్లరి’ ఇంటిపేరైపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో శ్వేతా అగర్వాల్ ఒకరు. ‘అల్లరి ’తర్వాత, ఏకంగా ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ […].

By: jyothi

Updated On - Sat - 11 September 21

Shweta Agarwal: ‘అల్లరి’ హీరోయిన్ శ్వేత అగర్వాల్ ఇప్పుడేం చేస్తోందంటే..

Shweta Agarwal: అల్లరి నరేష్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా అది. అందుకే, ‘అల్లరి’ కాస్తా నరేష్ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు రవిబాబు. రవిబాబు ఇంటి పేరు కూడా ‘అల్లరి’గానే మారిపోయింది. అంతే కాదు, ఈ సినిమాలో చాలామంది నటీనటుల పేర్ల ముందు ‘అల్లరి’ ఇంటిపేరైపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో శ్వేతా అగర్వాల్ ఒకరు. ‘అల్లరి ’తర్వాత, ఏకంగా ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఇంతకీ, ఈ బ్యూటీ ఇప్పుడేం చేస్తోంది.? తెలుగు సినిమాల్ని ఎందుకు వదిలేసింది.? అసలేంటి ఆమె కథ.? తెలుసుకుందాం పదండిక..

శ్వేత అగర్వాల్.. అలా పాపులర్ అయ్యింది..
ఓ ప్రైవేట్ ఆల్బమ్ ఆమె దశ మార్చేసింది. ‘దేఖా హై తేరే ఆఖోంకో’ అంటూ సాగే పాట తర్వాత శ్వేతా అగర్వాల్ పేరు మార్మోగిపోయింది దేశవ్యాప్తగా. అంత పెద్ద హిట్ అయ్యింది ఆ పాప్ సాంగ్. అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాప్ సాంగ్స్.. అనదగ్గ వాటిల్లో అది కూడా ఒకటి. ఆ పాప్ సాంగ్ ఆమెకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ఓ వైపు సినిమాలు ఇంకో వైపు మోడలింగ్.. వెరసి శ్వేతా అగర్వాల్ అప్పట్లో బాగానే పాపులర్ అయ్యింది.

రాఘవేంధ్ర సినిమాలో ఛాన్స్ అలా..
‘అల్లరి’ సినిమా తర్వాత అందులో ఆమె క్యూట్ అప్పీల్.. రాఘవేంద్ర సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చేలా చేసింది. అయితే, ‘రాఘవేంద్ర’ సినిమా.. అంచనాల్ని అందుకోలేకపోవడంతో, మళ్ళీ శ్వేతా అగర్వాల్ పేరు ఎక్కడా వినిపించలేదు. ‘గమ్యం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మమ అనిపించింది ఈ బ్యూటీ. అంతే, ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఓ కన్నడ సినిమా.. ఒకటీ అరా హిందీ సినిమాలు..
ఓ కన్నడ సినిమాలోనూ నటించిన శ్వేత, ఆ తర్వాత ఓ హిందీ సినిమాలో కూడా నటించింది. 2010 తర్వాత సినిమాల నుంచి దాదాపుగా దూరమైపోయింది. పెళ్ళి చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరంగా వుంటోంది ఈ బ్యూటీ.
శ్వేతా అగర్వాల్ భర్త ఎవరంటే..
శ్వేతా అగర్వాల్ భర్త పేరు ఆదిత్య నారాయణ్. దాదాపు పదేళ్ళ ప్రేమ నడిచింది ఇద్దరి మధ్యా. ఆదిత్య నారాయణ్ పలు సినిమాల్లో నటించాడు. పలు సినిమాలకు పాటలు కూడా పాడాడు. ఈ ఆదిత్య నారాయణ్ ఎవరో కాదు, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తనయుడు. పదేళ్ళ ప్రేమాయణంలో శ్వేత – ఉదిత్.. ఏనాడూ తమ ప్రేమని బయటకి వెల్లడించలేదు. కానీ, బాలీవుడ్ మీడియా మాత్రం ఎప్పటికప్పుడు వీరి ప్రేమాయణాన్ని కవర్ చేస్తూనే వచ్చింది.

తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన వుందా.?
శ్వేత అగర్వాల్ తిరిగి సినిమాల్లో నటించాలనుకుంటోందట. అందుకు మానసికంగా సిద్ధపడుతున్నట్లు చెప్పిన శ్వేత, తన భర్త అంగీకారం కూడా పొందినట్లు పేర్కొంది. సౌత్ నుంచే సినిమాల్లోకి శ్వేత రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

Tags

Latest News

Related News