Simran : ఆ హీరోతో సిమ్రాన్‌ డేటింగ్.. అతని నిజస్వరూపం తెలిసి ఏం చేసిందంటే?

Simran : తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో హీరోయిన్ సిమ్రాన్‌కు ఒక అధ్యాయం తప్పకుండా ఉంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. .

By: jyothi

Published Date - Fri - 23 September 22

Simran : ఆ హీరోతో సిమ్రాన్‌ డేటింగ్.. అతని నిజస్వరూపం తెలిసి ఏం చేసిందంటే?

Simran : తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో హీరోయిన్ సిమ్రాన్‌కు ఒక అధ్యాయం తప్పకుండా ఉంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడం విశేషం. అంతేకాకుండా ఆమెతో నటించిన వారంతా సిమ్రాన్ నటనకు ఎంతో మంత్రముగ్దులు అయ్యేవారట. ఒకానొక సమయంలో సిమ్రాన్ తెలుగు,తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ చాలా బిజీ హీరోయిన్‌గా మారింది.

స్టారో హీరో మాయలో పడిన సిమ్రాన్..

తెలుగు సినిమాల్లో సిమ్రాన్‌కు మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా భారీగానే వచ్చాయి. చిరంజీవితో డాడీ.. వెంకటేశ్ తో ప్రేమతో రా.. కలిసుందంరా.. నాగార్జునతో నువ్వు వస్తావని.. బాలయ్య బాబుతో నరసింహనాయుడు.. హరికృష్ణతో సీతయ్ వంటి సినిమాల్లో చేసిన సిమ్రాన్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే, సిమ్రాన్ తెలుగులో నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి.

వయస్సులో ఉన్నప్పుడు చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిమ్రాన్.. ఒక హీరోకు మాత్రం చాలా దగ్గర అయ్యిందట.. అతను తన మాయ మాటలతో ఆమె బుట్టలో వేసుకున్నాడట.. దీంతో అతనికి బాగా దగ్గరైన సిమ్రాన్ అతన్ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని భావించిందంట.. అతనితో ఎంతో గొప్ప జీవితాన్నిఊహించుకున్నదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ స్టార్ హీరో ఆమెను వంచన చేశాడని.. అప్పటికే ఇంకోక హీరోయిన్‌తో రిలేషన్ లో ఉన్నట్టు తెలిసిందట..

ఆ స్టారో హీరో మరెవరో కాదు తమిళ అగ్రహీరో, విశ్వనటుడు కమల్‌హాసన్.. కమల్‌తో సిమ్రాన్ కొంతకాలం డేటింగ్‌ చేసిందట..అంతకుముందే గౌతమితో కమల్ రిలేషన్ మెయింటేన్ చేశాడట. ఈ విషయం తెలిసి సిమ్రాన్ అతన్ని దూరం పెట్టిందట..ఈ బాధ నుంచి బయటపడటానికి కొంత కాలం సినిమాలకు కూడా దూరం అయ్యిందట..సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక మాళయాళం రీమేక్ దృశ్యంలో నటించే అవకాశం వచ్చినా సిమ్రాన్ ఆ అవకాశాన్ని రిజక్ట్ చేసి అతనికి తగిన శాస్తి చేసిందని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది.

Read Also : SR NTR-Balayya : బాలయ్యతో ఆ హీరోయిన్ కాళ్లు మొక్కించిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

Read Also : Chiranjeevi: చిరంజీవికి కాంగ్రెస్ ఐడెంటిటీ కార్డ్ జారీ

Related News