Sirivennela Sitarama Sastri.. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ‘సిరివెన్నెల’ శకం ముగిసింది. ఎన్నో గొప్ప గొప్ప గీతాలను అందించిన ఘనత సిరివెన్నెల సొంతం.. దాదాపు 6 దశాబ్దాలు సిరివెన్నెల సీతారామశాస్త్రీ చిత్ర పరిశ్రమలో గేయ రచయితగా కొనసాగుతూ వచ్చారు. నాటి సీనియర్ నటులతో పాటు నేటి తరం కుర్ర హీరోల సినిమాలకు సైతం సిరివెన్నెల అద్భుతమైన పాటలు అందించారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎంతో మంది దర్శకులకు సిరివెన్నెల ఆత్మీయుడిగా మారిపోయారు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’.. ‘అర్థశాతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందామా’? అనే లైనప్‌తో వచ్చిన పాటలు సిరివెన్నెల సత్తా ఏంటో ఇండస్ట్రీకి అర్థమైంది.
సిరివెన్నెల ప్రస్థానం..
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. ఆయన విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో 1955 మే 20వ తేదీన డాక్టర్ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. సిరివెన్నెల అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రీ.. ఆయన విద్యాభ్యాసం కాకినాడలో సాగింది. ఆంధ్ర యూనివర్సీటీలో MA పూర్తి చేశారు. సిరివెన్నెల చదువుకునే రోజుల్లో కవితలు, నాటకాలు రాసేవారని తెలిసింది. ఆ తర్వాత 1984 నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో తన కెరీర్ ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో ‘భరణి’ పేరుతో సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కవితలు రాసేవారని తెలిసింది. ఈ విషయం కె. విశ్వనాథ్ దృష్టికి రావడతో ఆయన సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అలా ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది.
ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’..
కె. విశ్వానాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రీ రాసిన పాటలు చాలా హిట్ అయ్యాయి. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావడంతో ఆ మూవీ పేరే సీతారామశాస్త్రీ ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆయన్ను అందరూ సిరివెన్నెల సీతారామశాస్త్రీగా పిలుకుకుంటారు.
Sirivennela Sitarama Sastri-1
అవార్డులు.. పాటల రికార్డులు
సిరివెన్నెల తన కెరీర్‌లో ఇప్పటివరకు 3వేలకు పైగా పాటలు రాశారు. 165 సినిమాల్లో ఆయన రాసిన పాటలకు గాను 11 నంది అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులను పొందారు. 2019లో కేంద్రం సిరివెన్నెలను పద్మశ్రీతో సత్కరించింది. ఈయన గేయ రచయితగానే కాకుండా కొన్ని సినిమాల్లో అథితి పాత్రలు చేశారు. జగబాతి బాబు నటించిన గాయం సినిమాలో సిరివెన్నెల వెండితెరపై కనిపించారు.
ఇకపోతే మొన్న వచ్చిన వెంకటేశ్ ‘నారప్ప’, ‘కొండపొలం’తో పాటు దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దోస్తి పాటను అందించారు. ఈ సాంగ్ భారీ హిట్ అయ్యింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆయనకు చాలా దగ్గరి బంధువు.. ఫ్యామిలీపరంగా చూసుకుంటే సిరివెన్నెలకు ఇద్దరు కుమారులు యోగి, రాజా ఉన్నారు. వీరు కూడా సినిమా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నట్టు తెలుస్తోంది.