అక్క హాట్.. చెల్లెలు డబుల్ హాట్.! నెంబర్ వన్ మాత్రం అక్కదే.!

నాటి నుంచి నేటివరకు గ్లామరస్ ప్రపంచంలో ఎంతోమంది అందగత్తెలు తాము వెండితెరపై వెలిగిపోవడమే కాదు, తమ అక్క చెల్లెళ్ళనూ సినీ రంగంలోకి తీసుకొచ్చారు. అయితే, అన్ని సందర్భాల్లోనూ అక్కా చెల్లెళ్ళిద్దరూ వెండితెరపై సక్సెస్ అవలేదు. కొన్నిసార్లు అక్కలు అత్యద్భుత విజయాలు సాధిస్తే, కొన్ని సందర్భాల్లో అక్కలు ఫెయిల్ అయి, చెల్లెళ్ళ హవా నడిచింది. పాత తరం సంగతి పక్కన పెడితే, గడచిన రెండు దశాబ్దాల్ల సినీ పరిశ్రమలోకి వచ్చిన అక్కా చెల్లెళ్ళ గురించీ, వెండితెరపై వారి గ్లామరస్ […].

By: jyothi

Updated On - Thu - 6 May 21

అక్క హాట్.. చెల్లెలు డబుల్ హాట్.! నెంబర్ వన్ మాత్రం అక్కదే.!

నాటి నుంచి నేటివరకు గ్లామరస్ ప్రపంచంలో ఎంతోమంది అందగత్తెలు తాము వెండితెరపై వెలిగిపోవడమే కాదు, తమ అక్క చెల్లెళ్ళనూ సినీ రంగంలోకి తీసుకొచ్చారు. అయితే, అన్ని సందర్భాల్లోనూ అక్కా చెల్లెళ్ళిద్దరూ వెండితెరపై సక్సెస్ అవలేదు. కొన్నిసార్లు అక్కలు అత్యద్భుత విజయాలు సాధిస్తే, కొన్ని సందర్భాల్లో అక్కలు ఫెయిల్ అయి, చెల్లెళ్ళ హవా నడిచింది. పాత తరం సంగతి పక్కన పెడితే, గడచిన రెండు దశాబ్దాల్ల సినీ పరిశ్రమలోకి వచ్చిన అక్కా చెల్లెళ్ళ గురించీ, వెండితెరపై వారి గ్లామరస్ సొగసుల గురించీ, వారు సాధించిన విజయాల గురించీ, కొందరి ఫెయిల్యూర్ స్టోరీల గురించీ తెలుసుకుందామా.?

ఆర్తి అగర్వాల్ – అదితి అగర్వాల్

ఎన్నారై భామ ఆర్తి అగర్వాల్, తెలుగు తెరకు ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా అది. అందులో చాలా క్యూట్ గానే కాదు.. కాస్త హాట్ గా కూడా కనిపించింది ఆర్తి అగర్వాల్. తక్కువ సినిమాలతోనే హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర పీఠం దక్కించుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ క్రమంలోనే తన సోదరి అదితి అగర్వాల్ ని కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి సినిమా ‘గంగోత్రి’ ద్వారా అదితి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా మంచి విజయాన్నే అందుకున్నా, ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు అదితి. సో, ఆర్తి సిస్టర్స్ విషయానికొస్తే.. అక్క హిట్టు.. చెల్లెలు ఫట్టు అన్నమాట.

కాజల్ అగర్వాల్ – నిషా అగర్వాల్

ఇక్కడా అగర్వాల్ సిస్టర్స్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ అగర్వాల్, అందాల చందమామ. అదేనండీ కాజల్ అగర్వాల్. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ అగ్ర హీరోయిన్ గా చెలామణీ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమలోనూ కాజల్ కెరీర్ హ్యాపీగానే కొనసాగుతోంది. కాజల్ తన సోదరి నిషా అగర్వాల్ ని తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసింది. ‘ఏమైంది ఈవేళ’ అంటూ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సినిమాతో తెరంగేట్రం చేసింది నిషా అగర్వాల్. నారా రోహిత్ సరసన ’సోలో‘ సినిమాలోనూ నటించి మెప్పించింది. అంతే, ఆ తర్వాత ఫ్లాపులు వెంటాడాయ్. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసిన నిషా, ఆ తర్వాత పెళ్ళి చేసేసుకుని, సెటిలైపోయింది. మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోందిప్పుడు.

శిల్పా శెట్టి – షమితా శెట్టి

కాస్త వెనక్కి వెళితే, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తెలుగులోనూ, తమిళంలోనూ పలు సినిమాలు చేసి, తనతోపాటు తన సోదరి షమితా శెట్టిని తెలుగు సినీ పరిశ్రమకు చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. శిల్పా శెట్టి, తెలుగులో పలువురు అగ్రహీరోల సరసన నటించింది. షమిత మాత్రం, చిన్న సినిమాలకే పరిమితమైంది. అక్కతో పోల్చితే, చెల్లెలు పెద్దగా తన ఉనికిని చాటుకున్నది లేదు.

రాధిక – నిరోష

సీనియర్ నటి రాధిక, ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గానే వున్నారు. బుల్లితెరపైనా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకప్పుడు ఆమె అగ్ర కథానాయిక. రాధికతో పోల్చితే ఆమె సోదరి నిరోషా, ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. చెప్పుకోదగ్గ సినిమాలే నిరోషా చేసినప్పటికీ, అక్కతో పోల్చలేం చెల్లెలి కెరీర్ ని. మాలాశ్రీ – శుభశ్రీ కూడా అంతే. ఇక్కడా అక్క హిట్టు.. చెల్లలు ఫట్టు. నెంబర్ వన్ పొజిషన్ మాత్రం అక్కలదే ఇక్కడ.

Tags

Related News