తొలి సినిమాతో కాస్త బొద్దుగా
రకుల్ ప్రీత్ సింగ్
rakul preeth signh
స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న రోజుల్లోనే ’రారండోయ్..‘ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కాస్త బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో కాస్త అవకాశాలు సన్నగిల్లడం, బాలీవుడ్ పై మోజు పెరగడంతో జీరో సైజ్ లోకి మారిపోయింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మథుడు 2‘ సినిమాలో బక్క చిక్కిపోయి కనిపించింది. అదే సమయంలో రెక్కపీత అంటూ సోషల్ మీడియా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది పాపం రకుల్ ప్రీత్ సింగ్.
ఇలియానా డిక్రజ్
ileana dcruz
నాజూకు నడుముకు కేరాఫ్ అడ్రస్ ఇలియానా. బెల్లీ బేబీ అని ముద్దుగా పిలుచుకుంటారు ఇలియానాని ఆమె అభిమానులు. అయితే, అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెండ్ కారణంగా సడెన్ గా బోద్దుగా మారిపోయింది ఇలియానా. రవితేజ హీరోగా రూపొందిన ’కిక్‘ సినిమాలో బొద్దుగా, ముద్దుగా కనిపించింది, మళ్లీ ’జల్సా‘ సినిమాలో దారుణంగా బక్క చిక్కిపోయి జీరో సైజ్ అందాలారబోసింది. విజయ్ హీరోగా వచ్చిన ’స్నేహితుడు‘ సినిమాలోని ఓ సాంగ్ లో బెల్లీ డాన్స్ కోసం సన్నజాజిలాంటి నడుముతో కనిపించి వావ్ అనిపించింది.
త్రిష క్రిష్ణన్
trisha
నయనతార
Nayantharaa
వెంకటేష్ హీరోగా ’లక్ష్మీ‘ సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ నయనతార, ’ సెల్యూట్‘ సినిమా కోసం జీరో సైజ్ ట్రై చేసింది. ఇక అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అవే బక్క చిక్కిన అందాలతో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకెళ్లిపోతోంది.
కీర్తి సురేష్
Keerthy-Suresh
’ నేను శైలజ‘ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్, బోద్దు తనానికి కేరాఫ్ అడ్రస్ అయిన హీరోయిన్ అనిపించుకుంది. క్యూట్ అప్పీల్ తో తెలుగు ప్రేక్షకుల్నే కాదు, తమిళ తంబీల్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే, ఈ మధ్య కీర్తి సురేష్ కూడా జీరో సైజ్ లోకి మారిపోయింది. కీర్తిసురేష్ ని బొద్దు లుక్స్ లోనే ఇష్ట పడిన ఆడియన్స్, ఆమె బక్క పలచని అందాలను కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారు కూడా. ’మిస్ ఇండియా‘, ’సఖి‘ సినిమాల్లో కీర్తి సురేష్ బాగా బక్క చిక్కిపోయి కనిపిస్తోంది.
మెహరీన్ కౌర్ పిర్జాదా
Actress Mehreen
’ క్రిష్ణగాడి వీర ప్రేమగాధ‘ సినిమాలో క్యూట్ అండ్ సెమీ హాట్ లుక్స్ లో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ మెహ్రీన్, తర్వాత జీరో సైజ్ లోకి మారిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ’ఎఫ్2‘ సినిమాలో బక్క పలచని అందాలతో బికినీలో సొగసులారేసింది.
తమన్నా భాటియా
Thamannah
ఎప్పుడూ ఫిట్ గా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్నా, కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ’నువ్వే నువ్వే‘ సినిమాలో కాస్త బొద్దుగా ఉందన్న కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ తన మునుపటి లుక్స్ అంటే, జీరోసైజ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ’సీటీమార్‘ సినిమాలో జ్వాలా రెడ్డి పాత్రలో కనిపించనుంది తమన్నా.
శ్రియ శరన్
sriya saran
ఇక శ్రియ విషయానికి వస్తే, తొలి సినిమాలోనే బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత స్లిమ్ లుక్స్ లోకి వచ్చేసింది. ‘ మల్లన్న’ సినిమాలో బాగా బక్క చిక్కిపోయినట్లు కనిపించిన శ్రియ నెటిజన్స్ నుండి కొన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ’పులి‘ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన శ్రియ డాన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే.