Sneha : ‘చంద్రముఖి’ సినిమాలో.. ఆ కారణాల వల్ల స్నేహ పాత్రను జ్యోతిక పోషించిందట..

Sneha : మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మనిచిత్రతాయ’ రీమేక్‌ను తొలుత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేయాలనుకున్నారట. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యనే తెలుగు రీమేక్‌కు దర్శకుడిగా ఉండి హీరోగా చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రూపుదిద్దుకోవాల్సింది. కానీ, అప్పుడున్న పరిస్థితులు ఇతర కారణాల రిత్యా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ‘మనిచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆ సినిమా బాగా నచ్చి, వెంటనే తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు. […].

By: jyothi

Published Date - Tue - 26 October 21

Sneha : ‘చంద్రముఖి’ సినిమాలో.. ఆ కారణాల వల్ల స్నేహ పాత్రను జ్యోతిక పోషించిందట..

Sneha : మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మనిచిత్రతాయ’ రీమేక్‌ను తొలుత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేయాలనుకున్నారట. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యనే తెలుగు రీమేక్‌కు దర్శకుడిగా ఉండి హీరోగా చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రూపుదిద్దుకోవాల్సింది. కానీ, అప్పుడున్న పరిస్థితులు ఇతర కారణాల రిత్యా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ‘మనిచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆ సినిమా బాగా నచ్చి, వెంటనే తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు.

అలా పి.వాసు డైరెక్షన్‌లో ‘చంద్రముఖి’ చిత్రానికి అడుగులు పడ్డాయి. ఈ సినిమాకు పి.వాసు స్క్రీన్ ప్లే , డైరెక్షన్ చేయగా, ఇందులో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, వడివేలు, నయనతార ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ చిత్రంలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపిందని చెప్పొచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లక లక లకలకలక’ డైలాగ్స్ ఆయన అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే, రజనీకాంత్‌కు ధీటుగా ‘చంద్రముఖి’ పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది. చిత్రంలో జ్యోతిక నటన కాని డైలాగ్ డెలివరి కాని సినిమాను మరో మెట్టుపై స్థాయిలో నిలబెట్టిందని చెప్పొచ్చు.

 

Sneha

Sneha

జర్మనీ దేశంలో విడుదల అయిన తొలి తమిళ్ సినిమా ‘చంద్రముఖి’ కాగా ఈ సినిమా అప్పట్లో సంచలనమే సృష్టించింది. కాగా, ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా ఉన్న జ్యోతిక పాత్రను పోషించాల్సింది ఆమె కాదట. స్నేహను ఈ పాత్రకు ఎంపిక చేసి సెట్స్‌పైకి వెళ్లారట మూవీ యూనిట్ సభ్యులు.

ఇక స్నేహాను ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్ చేసి ముందుకు సాగుతున్న క్రమంలో స్నేహ ఈ పాత్రకు సూట్ అవుతుందో కాదోనని సిమ్రాన్ వద్దకు వెళ్లారట. ఇక సిమ్రాన్ కూడా పాత్ర పోషించేందుకు మొగ్గు చూపించిందట. ‘చంద్రముఖి’ చిత్ర షూటింగ్ మొదలయిన కొద్ది రోజులకే సిమ్రాన్ ప్రగ్నెంట్ కాగా, ఆమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. అలా ఆమె కూడా సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ పేర్లను ఈ పాత్ర కోసం మూవీ యూనిట్ సభ్యులు పరిశీలించారట. మొత్తంగా స్నేహ, సిమ్రాన్ నుంచి తప్పించుకున్న పాత్ర జ్యోతిక వద్దకు వచ్చింది.

 

అలా చంద్రముఖి పాత్రనే జ్యోతికను ఎంపిక చేసుకుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో జ్యోతిక, ప్రభు జోడీగా నటించగా, రజనీకాంత్ సరసన నయనతార నటించింది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్, వడివేలు కామెడీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

Tags

Latest News

Related News