Directors : సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మారిపోయింది. టాలీవుడ్ స్థాయి కూడా భారీగా పెరిగిపోతోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు బాగా పెరిగిపోతున్నాయి. కొందరు డైరెక్టర్లు రూ.100కోట్లను టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు.
చాలామంది డైరెక్టర్లు పదుల కొద్దీ సినిమాలు చేసినా వారికి రూ.100కోట్ల మార్కు అనేది చాలా కష్టం. కానీ ఇద్దరు డైరెక్టర్లు మాత్రం మొదటి మూవీతోనే రూ.100 కోట్ల మార్కు అందుకున్నారు. అందులో ఒకరు బుచ్చి బాబు సాన. ఆయన సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదటి మూవీతోనే ఆయన ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా మరో డైరెక్టర్ ఆ ఫీట్ అందుకున్నాడు. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. ఆయనే శ్రీకాంత్ ఓదెల.
ఆయన రీసెంట్ గా దసరా సినిమాను తీశారు. నాని హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దాంతో ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు మార్మోగిపోతున్నాయి. పైగా ఇద్దరూ కూడా సుకుమార్ శిష్యులే కావడంతో ఆయన క్రేజ్ ఇంకా డబుల్ అయిపోయింది. ఎంతైనా సుకుమార్ స్కూల్ అలా ఉంటుందని అంటున్నారు.
Read Also : SS Rajamouli : రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. నటనలో ఆయన్ను కొట్టేవారే లేరు..
Read Also : Actress : యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్న సమంత సిస్టర్.. ఎంత మందిని చేస్తావమ్మా..!