• Telugu News
  • movies

South heroes Instagram followers : సౌత్ హీరోల్లో వీరికే ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్‌.. వారు ఎవ‌రంటే..?

South heroes Instagram followers : సోషల్ మీడియా.. ఓ మనిషిని హైలెట్ చేయాలన్నా.. డామినేట్ చేయాలన్నా.. దీని తర్వాతే ఏదైనా. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది సోషల్ మీడియానే.. వీటిల్లో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. వారు అలా పోస్ట్ పెడితే క్షణాల్లోనే అది వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఎక్కువగా ఉపయోగించేది ఇన్‌స్టాగ్రామ్.. ఇందులో చాలా మంది హీరోలో ఫాలోవర్స్‌ను పెంచుకుని హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి సంబంధించిన […].

By: jyothi

Updated On - Sat - 4 December 21

South heroes Instagram followers : సౌత్ హీరోల్లో వీరికే ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్‌.. వారు ఎవ‌రంటే..?

South heroes Instagram followers : సోషల్ మీడియా.. ఓ మనిషిని హైలెట్ చేయాలన్నా.. డామినేట్ చేయాలన్నా.. దీని తర్వాతే ఏదైనా. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది సోషల్ మీడియానే.. వీటిల్లో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. వారు అలా పోస్ట్ పెడితే క్షణాల్లోనే అది వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఎక్కువగా ఉపయోగించేది ఇన్‌స్టాగ్రామ్.. ఇందులో చాలా మంది హీరోలో ఫాలోవర్స్‌ను పెంచుకుని హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.


గతంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి సంబంధించిన న్యూస్ గానీ, లేదంటే ప్రముఖులకు సంబంధించిన వార్త కేవలం మీడియాలో మాత్రమే వచ్చేది. తమ సినిమాలకు సంబంధించి గానీ, యాడ్స్ కు సంబంధించి గానీ దాదాపు మీడియాపైనే ఆధారపడేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీని అందుపుచ్చుకోవడంతో ప్రమోట్ చేసుకునే తీరుసైతం మారింది.


సోషల్ మీడియాలో మనిషి లైఫ్ లోకి ఎంటరయ్యాక ఒకే ఒక క్లిక్‌తో క్షణాల్లో ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు చెప్పుకోదగిన ఇన్ స్టా.. చాలా మందికి కోట్లల్లో ఫాలోవర్స్ ను సంపాదించి పెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 సౌత్ ఇండియన్ స్టార్స్ ఎవరో చూద్దాం.

South heroes Instagram followers-2

South heroes Instagram followers-2

సౌత్ ఇండియన్ స్టార్స్‌లో ఇన్ స్టాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనకు ఇన్ స్టాలో ప్రస్తుతం 13.9 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన నటించిన పుష్ప మూవీ ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉంది. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ‌ 13.8 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.


ఇక దుల్కర్ సల్మాన్ 9.4 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడో ప్లేస్ ఆక్రమించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 7.5 మిలియన్ ఫాలోవర్స్ తో నాల్గో ప్లేస్ లో నిలిచారు. ఆయన యాక్ట్ చేసిన సర్కారువారి పాట మూవీ నెక్ట్స్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్.. ఇన్ స్టాలో 7.4 మిలియన్ ఫాలోవర్స్‌తో 5వ స్థానంలో కొనసాగుతున్నారు.


ఆయన యాక్ట్ చేసిన రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆయన చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. ఇక టివినో థామస్ 5.9 మిలియన్ ఫాలోవర్స్ తో 6 వ ప్లేస్, యశ్ 5.3 మిలియన్ ఫాలోవర్స్‌తో 7వ ప్లేస్, రామ్ చరణ్ 4.7 మిలియన్ ఫాలోవర్స్‌తో 8వ ప్లేస్ లో నిలిచారు. విజయ్ సేతుపతి 4.5 మిలియన్ ఫాలోవర్స్‌ 9వ ప్లేస్ సొంతం చేసుకోగా.. 4.4 మిలియన్ ఫాలోవర్స్‌తో రానా దగ్గుబాటి పదో స్థానంలో ఉన్నారు.

Tags

Latest News

Related News