Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఛాన్సులు తెచ్చుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారికి అయితే చాలానే సమస్యలు ఎదరవుతున్నాయి. అందులోనూ అమ్మాయిలు అయితే కాస్టింగ్ కౌచ్ కు గురి కావాల్సిందే అన్నట్టు ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి.
చాలామంది ముద్దుగుమ్మలు ఈ కాస్టింగ్ కౌచ్ కు బలైపోతున్నారు. అందులో కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల కూడా మొదట్లో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నట్టు తెలుస్తోంది.
ఆమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆమె కెరీర్ స్టార్టింగ్ లో ఓ కన్నడ డైరెక్టర్ కలిశాడంట. తన కోరిక తీరిస్తే బిగ్ ఆఫర్ ఇప్పిస్తానని డీల్ మాట్లాడాడు. కానీ మొదటి నుంచి మొండి పట్టుదల ఉన్న శ్రీలీల దానికి ఒప్పుకోలేదు. అతని ఆఫర్ ను రిజెక్ట్ చేసి తన కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నించింది.
ఆమె అనుకున్నట్టు గానే తన ట్యాలెంట్ తోనే ఎదగుతోంది. మొన్ననే ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఆమె జోరు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకునేలా ఉంది.
Read Also : Kangana Ranaut : ఆ స్టార్ హీరోతో ప్రియాంక చోప్రా ఎఫైర్.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Shruti Haasan : ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది.. శృతిహాసన్ ఇలా తెగించిందేంట్రా బాబు..!