Sridevi : బోణి కపూర్ కంటే ముందే శ్రీదేవికి ఆ స్టార్ యాక్టర్‌తో పెళ్లి జరిగిందా..?

Sridevi : అతిలోకసుందరి శ్రీదేవి ఒక్క ఇండస్ట్రీకి చెందిన నటి కాదు. భారతదేశం మొత్తం గర్వించదగ్గ స్టార్ యాక్టర్. ఆమె దాదాపు అన్ని భాషల్లోనూ నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అందుకుంది. .

By: jyothi

Published Date - Fri - 23 September 22

Sridevi : బోణి కపూర్ కంటే ముందే శ్రీదేవికి ఆ స్టార్ యాక్టర్‌తో పెళ్లి జరిగిందా..?

Sridevi : అతిలోకసుందరి శ్రీదేవి ఒక్క ఇండస్ట్రీకి చెందిన నటి కాదు. భారతదేశం మొత్తం గర్వించదగ్గ స్టార్ యాక్టర్. ఆమె దాదాపు అన్ని భాషల్లోనూ నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అందుకుంది. అనుకోకుండా శ్రీదేవి మరణం చాలా మంది అభిమానులను, నటీనటులను, రాజకీయ, వ్యాపార ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే అన్నిరంగాల్లోనూ శ్రీదేవిని అమితంగా అభిమానించే వారు ఉన్నారు. ఈ నటి తన జీవితంలో వందల సంఖ్యల సినిమాల్లో నటించింది.

శ్రీదేవి మొదటి భర్త ఎవరు..

శ్రీదేవి తెలుగు, తమిళ,మళయాళంతో పాటు బాలీవుడ్‌లో అధికంగా సినిమాలు చేసింది. తెలుగులో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవితో ఎస్పీ పరుశురాం సినిమా కూడా చేసి హిట్ కొట్టింది ఈ దివంగత సీనియర్ నటి.. శ్రీదేవి సినిమాల్లో నటిస్తున్న టైంలోనే నిర్మాత బోణి కపూర్‌ను వివాహం చేసుకుని అప్పట్లో అందరినీ ఆశ్చార్యానికి గురిచేసింది.

అయితే, అప్పటికే బోణికపూర్‌కు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి బోణి కపూ‌ర్‌ను ఎలా పెళ్లి చేసుకుందా అని అప్పట్లో చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు బోణి కపూర్ దగ్గరున్న డబ్బులు చూసి చేసుకుందని కామెంట్స్ కూడా చేశారు. కానీ శ్రీదేవి బోణికపూర్‌ను చేసుకోవడం వెనుక ఓ బాధాకరమైన స్టోరీ ఉందట..

శ్రీదేవి బోణి కపూర్‌ను పెళ్లాడేకంటే ముందు బాలీవుడ్ రాకింగ్ స్టార్ మిథున్ చక్రవర్తిని ఎంతో గాఢంగా ప్రేమించిందట. వీరిద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారట.. అప్పటికే మిథున్‌కు పెళ్లి జరిగింది. ఆ విషయాన్ని అతను శ్రీదేవి దగ్గర దాచాడట.. తీరా ఈ విషయం అతని భార్యకు తెలిసిందట.. ఆమె గొడవ చేయడంతో పాటు భార్యను వదిలేసి వస్తేనే మీరు కలిసి ఉండాలని శ్రీదేవి తల్లి షరతు పెట్టిందట.. దీంతో మిథున్ నెమ్మదిగా శ్రీదేవి దూరం అయ్యాడు. ఆక్రమంలోనే బోణి కపూర్ శ్రీదేవికి దగ్గరై ఆమెను రెండో వివాహం చేసుకున్నాడట..

Read Also : NTR-Heroine : ఎన్టీఆర్ ను ఇంటికెళ్లి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Read Also : Tamannaah : తెలుగు హీరోలు వేస్ట్.. ఆ బాలీవుడ్ హీరోనే బెస్ట్ అంటున్న తమన్నా..

Related News