Sridevi : శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన ఆ సినిమా మీకు తెలుసా?

Sridevi : హాస్య చక్రవర్తి రాజబాబు గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నవ్వుల రేడు.. రాజబాబు అప్పట్లో హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుని సత్తా చాటాడు. ఆంధప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన రాజబాబు నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చి కమెడియన్‌గా రాణించారు. బక్క పల్చని రూపంలో రాజబాబు వెండితెరపై కనబడితే చాలు నవ్వులు పూసేవి. అటువంటి గొప్ప నటుడు అయిన రాజబాబు హీరోగా కూడా పలు సినిమాల్లో […].

By: jyothi

Published Date - Wed - 3 November 21

Sridevi : శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన ఆ సినిమా మీకు తెలుసా?

Sridevi : హాస్య చక్రవర్తి రాజబాబు గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నవ్వుల రేడు.. రాజబాబు అప్పట్లో హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుని సత్తా చాటాడు. ఆంధప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన రాజబాబు నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చి కమెడియన్‌గా రాణించారు.

బక్క పల్చని రూపంలో రాజబాబు వెండితెరపై కనబడితే చాలు నవ్వులు పూసేవి. అటువంటి గొప్ప నటుడు అయిన రాజబాబు హీరోగా కూడా పలు సినిమాల్లో నటించారు. అందులో యూనివర్సల్ స్టార్ అయిన దివంగత శ్రీదేవి కూడా ఉండటం విశేషం.

పాపులర్ కమెడియన్‌గా ఉంటూనే రాజబాబు పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇక శ్రీదేవి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల అగ్రతారల సరసన హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి..మూడు తరాల హీరోలతో నటించింది. ఇకపోతే అప్పటి తరం, ఇప్పటి తరం హీరోలు చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్‌గా నేటికీ శ్రీదేవి ఉంది. యూనివర్సల్ లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన శ్రీదేవి మూడేళ్ల కిందట అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. ఈ సంగతులు పక్కనబెడితే.. శ్రీదేవి హీరోయిన్‌గా పలు స్టార్ హీరోల సరసన నటించడంతో పాటు హాస్య చక్రవర్తి అయిన రాజబాబు పక్కన హీరోయిన్‌గా నటించడం విశేషమనే చెప్పొచ్చు. ఆ సినిమాలో రాజబాబు, శ్రీదేవి జంటగా ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. ఆ సినిమా పేరేమిటంటే..

Sridevi 2

Sridevi 2

బాలనటిగా వెండితెరకు పరిచయమయిన శ్రీదేవి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. అయితే, ఆమె కెరీర్ తొలినాళ్లలోన ప్రముఖ కమెడియన్ రాజబాబు చిత్రంలో ఆయన సరసన కథానాయికగా నటించింది. ఆ చిత్రం ‘దేవుడు లాంటి మనిషి’. ఈ సినిమాలో కృష్ణ మంజుల జంటగా నటించగా, మరో వైపున రాజబాబు, శ్రీదేవి జంటగా నటించారు. అయితే, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌ను చాలా తక్కువ కాలంలోనే శ్రీదేవి సంపాదించుకుంది. అలా రాజబాబు సరసన హీరోయిన్‌గా నటించిన వారిలో శ్రీదేవి కూడా ఉండటం గమనార్హం.

 

Sridevi 1

Sridevi 1

ఇక తెలుగులో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన సినిమాలు బోలెడున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామరావు వంటి అలనాటి తారలను మొదలుకుని నేటి తారలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితరుల సరసన పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది అతిలోక సుందరి దివంగత శ్రీదేవి. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె కూతురు జాన్వికపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది.

Tags

Latest News

Related News