SS Rajamouli : ఇప్పుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. ఆయన అడగాలే గానీ.. వందల కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేసి సినిమాలు చేయించుకునేందుకు రెడీగా ఉంటున్నారు చాలామంది.
అయినా సరే రాజమౌళి మాత్రం ఇతర ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేయట్లేదు. కేవలం తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా తీస్తున్నారు. కాగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు రాజమౌళి. కానీ ఒక్క అల్లు అర్జున్ తో మత్రమే చేయలేదు.
దానికి కారనం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా సమయంలో రాజమౌళి చెప్పిన విషయాలను పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారంట అల్లు అరవింద్.
దాంతో రాజమౌళిక కోపం వచ్చేసి ఆయనతో గ్యాప్ మెయింటేన్ చేస్తున్నారంట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయట్లేదు రాజమౌళి. అలాగే అల్లు అర్జున్ కూడా చేయనని తెగేసి చెప్పేశాడంట. కానీ తండ్రి చేసిన తప్పుకు కొడుకును శిక్షించడం ఏంటని అడుగుతున్నారు బన్నీ ఫ్యాన్స్.
Read Also : Actress Madhavi Latha : తెలుగు హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇవ్వరు.. అందుకే టాలీవుడ్ పట్టించుకోదుః మాధవీలత
Read Also : Ram Gopal Varma : పవన్ కల్యాణ్ ఒక దద్దమ్మ.. ఆర్జీవీ సంచలన విమర్శలు..!