SS Rajamouli : టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆయన తీస్తున్న సినిమాలు ఎలాంటి చరిత్రను సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసే ఒక్కో మూవీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తన సినిమా రికార్డును బ్రేక్ చేయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం అవుతుంది.
అలాంటి రాజమౌళికి నటన మీద, ఒక కథ మీద ఉన్నంత పట్టు ఇంక ఎవరికీ ఉండదనే చెప్పుకోవాలి. ఒక సీన్ లో ఎలాంటి డైలాగులు ఉండాలి, ఎలా నటించాలి అనేది మాత్రం రాజమౌళికి మాత్రమే తెలుసు. అలాంటి రాజమౌళికి కూడా ఓ ఫేవరెట్ హీరో ఉన్నాడు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమౌళి మెచ్చుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఎన్నో సార్లు జక్కన్న స్వయంగా చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించినట్టు ఇండియాలో ఎవరూ నటించలేరని స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు రాజమౌళి . సింగిల్ టేక్ ఆర్టిస్టుగా జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజ్ ఉందని రాజమౌళి స్వయంగా చెప్పాడు.
ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయే గుణం ఉన్న హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని చెబుతున్నాడు రాజమౌళి. అందుకే తనకు కేవలం ఎన్టీఆర్ అంటే మాత్రమే ఇష్టం అని ఎన్నోసార్లు జక్కన్న చెప్పాడు.
Also Read : Sreeleela : శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కుందా.. కోరిక తీర్చమన్న స్టార్ డైరెక్టర్..!
Also Read : Sunil : సునీల్ మీద చెత్త చెత్త రూమర్.. ఆ నటితో అలాంటి పని చేస్తున్నాడా..?