• Telugu News
  • movies

Star Heroes Movies: మన స్టార్ హీరోల సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు తక్కువ రేటింగ్ రాబట్టుకున్న సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Star Heroes Movies: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ వాళ్ళ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడానికి మంచి కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు హిట్లతో పాటు ఫ్లాపులు కూడా వస్తూ ఉంటాయి అయితే సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చాలా తక్కువ రేటింగ్ సాధించుకుంటాయి అప్పట్లో కూడా చాలా సినిమాలు […].

By: jyothi

Published Date - Thu - 2 September 21

Star Heroes Movies: మన స్టార్ హీరోల సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు తక్కువ రేటింగ్ రాబట్టుకున్న సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Star Heroes Movies: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ వాళ్ళ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడానికి మంచి కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు హిట్లతో పాటు ఫ్లాపులు కూడా వస్తూ ఉంటాయి అయితే సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చాలా తక్కువ రేటింగ్ సాధించుకుంటాయి అప్పట్లో కూడా చాలా సినిమాలు థియేటర్లో ఆడినప్పటికీ టెలివిజన్ లో పెద్దగా ఆడకపోయేవి అయితే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మన హీరోల సినిమాలు ఫస్ట్ టైం టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఎంత TRP రేటింగ్ ని సంపాదించుకున్నయో ఒకసారి తెలుసుకుందాం…


వినయ విధేయ రామ
బోయపాటి శీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ ఈ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది రామ్ చరణ్ కెరియర్ లోనే అట్టర్ ఫ్లాప్ సినిమా ఏదైనా ఉంది అంటే మొదటగా వినయ విధేయ రామ సినిమా పేరు చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమా ఫస్ట్ టైం టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా చాలా చాలా తక్కువ రేటింగ్ ని సాధించుకొని టెలివిజన్ లో కూడా ఫ్లాప్ సినిమాగా గుర్తింపు పొందింది. అయితే మొదటి సారి టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు 8.1 రేటింగ్ ని సంపాదించుకుంది…

బ్రహ్మోత్సవం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది అలాంటి సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 7.52 రేటింగ్ ని మాత్రమే రాబట్టుకుంది…

ఖైదీ నెంబర్ 150
చిరంజీవి రీ ఎంట్రీ సినిమా గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ ఫస్ట్ టైం టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు చాలా తక్కువ రేటింగ్ సంపాదించుకుంది మరీ దారుణంగా 6.93 రేటింగ్ మాత్రమే సంపాదించుకుంది…


సరైనోడు
బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అయినప్పటికీ టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా 6.2 రేటింగ్ మాత్రమే రాబట్టుకొని అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కూడా బాగా నిరాశకు గురి చేసింది…

అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది ఈ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు 6.1 రేటింగ్ మాత్రమే సంపాదించుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేసింది…

సాహో
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది దాంతో టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.81 రేటింగ్ మాత్రమే సంపాదించుకొని టెలివిజన్ లో కూడా ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఇలా స్టార్ హీరోల సినిమాలు సైతం బుల్లితెరపై పెద్దగా జనాలని ఆకట్టుకోకపోవడం అనేది హీరోల ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా తీవ్ర నిరాశ కి గురి చేసే అంశం అని మనం చెప్పవచ్చు..

Latest News

Related News