Star Heroines Anonymous Roles: అనామక పాత్రల్లో నటించిన స్టార్ హీరోయిన్లు

Star Heroines Anonymous Roles: తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ల ముందు సినిమాలు ఏంటో మీకు తెలుసా…?తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తూ సినిమాలు చేస్తూ రోజు రోజుకి వాళ్ళ ఇమేజ్ ని పెంచుకుంటూ గుర్తింపును సాధించుకుంటు వస్తున్నారు అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఒక సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు అలా ఇండస్ట్రీలో ప్రస్తుతం […].

By: jyothi

Published Date - Thu - 21 October 21

Star Heroines Anonymous Roles: అనామక పాత్రల్లో నటించిన స్టార్ హీరోయిన్లు

Star Heroines Anonymous Roles: తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ల ముందు సినిమాలు ఏంటో మీకు తెలుసా…?తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తూ సినిమాలు చేస్తూ రోజు రోజుకి వాళ్ళ ఇమేజ్ ని పెంచుకుంటూ గుర్తింపును సాధించుకుంటు వస్తున్నారు అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఒక సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు అలా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ అందరూ అగ్ర హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వాళ్లు అంతకుముందు చేసిన సినిమాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం అయితే ప్రస్తుతం అగ్ర హీరోయిన్లందరూ ఇంతకుముందు చేసిన గుర్తింపు లేని సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

కెరటం – రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ కెరటం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఆ సినిమా తెలుగులో ఆశించిన విజయాన్ని సాధించలేదు దాంతో ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలను చేసింది ప్రస్తుతం టాప్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె కెరటం సినిమాలో హీరోయిన్ గా చేసింది అనే విషయం చాలామంది ఆడియన్స్ కి తెలియదు ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు కూడా ఆమె ఆ సినిమాలో నటించిందా అని ఆశ్చర్యపోతున్నారు అలా లైమ్ లైట్ లోకి రాకముందు హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఉంటారు కానీ అవి పెద్దగా గుర్తింపు పొందవు…

రెండు – అనుష్క శెట్టి
అనుష్క హీరోయిన్ గా మాధవన్ హీరోగా వచ్చిన రెండు అనే సినిమాలో నటించారు ఈ సినిమాలో నటించిన విషయం జనాలతో పాటు అనుష్క ఫ్యాన్స్ కి కూడా తెలియదు అలా ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు ఇప్పుడు చూస్తున్న జనాలు అనుష్క ఈ సినిమా ఎప్పుడు చేసిందా అని ఆలోచిస్తున్నారు ప్రస్తుతం తెలుగులో అనుష్క టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా చేస్తుంది…

వ్యాపారి – తమన్నా
తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న తమన్నా వరుసగా సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉంది అయితే తెలుగు సినిమాల కంటే ముందు తమన్నా వ్యాపారి అనే సినిమాలో కూడా నటించిన విషయం ఎవరికీ తెలియదు అలా ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలీదు దాంతో ఈ మిల్కీ బ్యూటీని ఆ సినిమాలో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు…

పూజా హెగ్డే – మాస్క్
తెలుగులో ముకుందా ఒక లైలా కోసం సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది అలాగే అలా వైకుంఠపురంలో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సాధించింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అలా పూజా హెగ్డే ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది అని చెప్పాలి తెలుగు సినిమాల కంటే ముందే జీవా హీరోగా వచ్చిన మాస్క్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అయినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డే ని పెద్దగా దర్శకులు నిర్మాతలు హీరోలు పట్టించుకోలేదనే చెప్పాలి…

ఫోటో – అంజలి
జర్నీ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సాధించుకుంది అంజలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ గీతాంజలి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది అయితే అంజలి ఈ సినిమాల కంటే ముందే తెలుగులో ఫోటో అనే సినిమాలో నటించింది ఆమె నటించిన విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది దాంతో ఆవిడని ఎవరు పట్టించుకోలేదు మళ్లీ జర్నీ సినిమా విజయం సాధించడంతో ఆవిడకి అవకాశాలు వెల్లువలా వచ్చాయి..

Latest News

Related News