Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎప్పుడైతే ఈటీవీ నుంచి బయటకు వచ్చాడో నాటి నుంచి మనోడికి అదృష్టం కలిసి రావడం లేదని తెలుస్తోంది. పెద్దగా ఛానెళ్లలో కనిపించడం లేదు. నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఈవెంట్స్, షోస్‌లో యాంకరింగ్ చేయడానికి కూడా అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. తన కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎలాగైతే తిరిగాడో త్వరలో మళ్లీ అదే పరిస్థితి రాబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు మెండుగా కనిపిస్తున్నాయి.
సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఆయన ఏ ఛానెల్‌లో ఉంటే దాని రేటింగ్స్ అమాంతం పెరుగుతాయట..అందుకే సుధీర్‌ను కొనడానికి అప్పట్లో చాలా ఛానెళ్లు ట్రై చేశాయి. కానీ సుధీర్ అందుకు ఒప్పుకోలేదు. జబర్దస్త్‌లోకి వచ్చాక మనోడికి స్టేటస్, పాపులారిటీ, ఆర్థికంగా కూడా బాగా కుదిరింది. మల్లెమాల యాజమాన్యం సుధీర్‌ను ఇంట్లో వ్యక్తిగా చూసుకునేవారట..
అసలు ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతం సుధీర్ ఈటీవీ వచ్చే ఢీ డ్యాన్స్ షో, శ్రీదేవి డ్రామాకంపెనీ, జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక్కడి నుంచి స్టార్ మా ఛానెల్‌కు, జీ ఛానెల్‌లో కూడా కొన్ని సార్లు కనిపించాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడా కనిపించడం లేదు. స్టార్ మా, జీ సంస్థలు సుధీర్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో మనోడు రోడ్డు మీదకు వచ్చేశాడని టాక్ వినిపిస్తొంది. సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోయాయి.
ఈ క్రమంలోనే సుధీర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అసలు ఈటీవీ నుంచి రావడమే సుధీర్ చేసిన తప్పు అని కొందరు అంటున్నారు. అందులో ఉంటే డబ్బులకు డబ్బులు, మంచిగా ఆదరణ ఉండేదని అంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో తేడాలు వచ్చి సుధీర్ జబర్దస్త్‌ను వీడానని అప్పట్లో వార్తలు వచ్చాయి. మేనేజర్ ఏడుకొండలు కూడా వారిని ఎలాగైనా తీసుకొస్తామని మొన్నీమధ్య చెప్పాడు. హైపర్ ఆది కూడా జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ కూడా రావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : Viral Video : నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. కనిపిస్తే చెప్పండి
Also Read : Nayanthara-Vignesh: వామ్మో.. నయన్ ను నిద్ర పోనివ్వని విఘ్నేశ్.. రాత్రంతా అదే పని అంట..!