Suhasini Maniratnam : డైరెక్టర్స్‌ను మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్స్ వీళ్లే..

Suhasini Maniratnam : ప్రేమ అనేది సృష్టిలో అతి ముఖ్యమైనది. కాగా, ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కాగా, సాధారణ ప్రజలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామనే. కానీ, ఒకవేళ సెలబ్రిటీలు ఆ పని చేస్తే సొసైటీలో చర్చనీయాంశమవుతుంది. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో బాగా పేరొందిన హీరోయిన్ కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ విషయమై చాలా మంది చర్చించుకుంటారు. హీరోయిన్ మరో సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకుంటే […].

By: jyothi

Published Date - Mon - 1 November 21

Suhasini Maniratnam : డైరెక్టర్స్‌ను మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్స్ వీళ్లే..

Suhasini Maniratnam : ప్రేమ అనేది సృష్టిలో అతి ముఖ్యమైనది. కాగా, ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కాగా, సాధారణ ప్రజలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామనే. కానీ, ఒకవేళ సెలబ్రిటీలు ఆ పని చేస్తే సొసైటీలో చర్చనీయాంశమవుతుంది. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో బాగా పేరొందిన హీరోయిన్ కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ విషయమై చాలా మంది చర్చించుకుంటారు.

హీరోయిన్ మరో సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకుంటే ఆ విషయం గురించి చాలా మంది చర్చించుకుంటారు. కాగా నేటి తరం హీరోయిన్స్ నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రమే అలా చేయగలరు అని అనుకుంటే మీరు పొరపడినట్లే.. ఆ నాటి అలనాటి కథానాయికలు సైతం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సీనియర్ హీరోయిన్స్ ఎవరంటే..

సినిమాల్లో సాధారణంగా హీరోయిన్స్ హీరోలను ప్రేమిస్తుంటారు. కానీ, రియల్ లైఫ్‌లో ఈ హీరోయిన్స్ హీరోలను కాకుండా లవ్ స్టోరిలను రాసిన డైరెక్టర్స్‌ను ప్రేమించేశారు. తాము పని చేసిన దర్శకులను ప్రేమించి వారి జీవితంలోకి అడుగుపెట్టేశారు. ప్రేమ కథలు, సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలోనో లేదా వారి గురించి తెలుసుకునో ఏమో తెలియదు కానీ మొత్తంగా దర్శకులనే ప్రేమించేసి వారినే పెళ్లి చేసుకున్నారు. వారు సుహాసిని మణిరత్నం, ఖుష్బూ సుందర్, రాశీ నివాస్, రోజా సెల్వమణి, శరణ్య పాన్నవన్, శోభ బాలు మహేంద్ర, దేవయాని రాజ్ కుమారన్, రమ్యకృష్ణ కృష్ణవంశీ, ప్రీతి హరి..

Suhasini Maniratnam

Suhasini Maniratnam

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా తాను పని చేసిన దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోజా ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉంటూనే, బుల్లితెరపైన సందడి చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది రోజా. రోజా నటించిన తొలి చిత్రం ‘చామంతి’ని డైరెక్ట్ చేసిన సెల్వమణినే రోజా మ్యారేజ్ చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. సీనియర్ హీరోయిన్ సుహాసిని ఫేమస్ డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక ఖుష్బూ కూడా అంతే.. డైరెక్టర్ సుందర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ‘బాహుబలి’ శివగామిదేవి రమ్యకృష్ణ కూడా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది రమ్యకృష్ణ…చివరకు కృష్ణవంశీనే వివాహం చేసుకుంది. రాశీ తన దగ్గర అసిస్టెంట్‌గా ఉన్న నివాస్‌ను మ్యారేజ్ చేసుకోగా, శరణ్య పాన్నవన్‌ను, శోభ డైరెక్టర్ బాలు మహేంద్రను, దేవయాని రాజ్ కుమారన్‌ను ప్రీతి హరిని పెళ్లి చేసుకున్నారు.

Tags

Related News