Suma kanakala : సుమ కనకాల.. ఈమె పేరు ఎవ్వరికి అయినా గుర్తు ఉంటుంది.. నిద్రలో లేపి అడిగిన కూడా వెంటనే చెప్పేసే సత్తా వీరికి ఉంది.. యాంకర్ గా ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ ఇప్పటికి రాణిస్తుంది.. బుల్లితెర పై షోలు చేస్తూనే సినిమాల ఈవెంట్స్ కూడా వరుసగా చేస్తూ స్టార్ యాంకర్ గా ఎదిగింది..
గత కొన్నేళ్లుగా యాంకర్ అంటే సుమ.. సుమ అంటేనే యాంకర్ అనే స్థాయికి ఈమె ప్రేక్షకులను చేర్చింది.. తన గలగల మాటలతో హోస్ట్ చేసిన ప్రతీ షోను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తూ వస్తుంది.. ఇక స్టార్ హీరోలు సైతం తమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం, ఆడియో ఫంక్షన్స్ కోసం ఈమెనే యాంకర్ గా కావాలని పట్టుబడతారు.. మరి అంతలా ఈమె యాంకర్ గా టాలీవుడ్ ను శాసిస్తుంది.
ఇదిలా ఉండగా ఈమె గురించి తాజాగా ఒక రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.. సుమ రాజీవ్ కనకాల కంటే ముందే మరొక డైరెక్టర్ తో రొమాన్స్ చేసింది అంటూ నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది. సుమ ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదాం అని వచ్చిందట.. దాసరి నారాయణరావు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కూడా దక్కిందట.. కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో వక్కంతం వంశీ హీరోగా చేసారు..
Suma kanakala Did Movie With Vakkantham Vamsi Before Rajeev Kanakala
ఈ సినిమాలోనే ఈమెకు అవకాశం వరించిందట.. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.. కానీ ఈ సినిమా ఈ ఇద్దరికీ సక్సెస్ అవ్వలేదు.. దీంతో వక్కంతం రచయితగా మారితే సుమ యాంకరింగ్ రంగాన్ని ఎంచుకుంది.. ఇదే కాదు సుమ మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈమెకు నటన సూట్ కాలేదని యాంకరింగ్ చేసుకుంటుంది. ఈ రోజున యాంకరింగ్ ను శాసించే లెవల్ కు చేరుకుంది.
Read Also : Surekha Vani : ఆ డైరెక్టర్ తో తిరుగుతున్న సురేఖవాణి.. జాగ్రత్త అంటున్న నెటిజన్లు..!
Read Also : Tamanna Bhatia : వామ్మో.. తమన్నా అలాంటి అబ్బాయిలను చూస్తే ఆ పని చేస్తుందట..