Sunil: ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిపోయిన సునీల్ ఇప్పుడు ఎంత రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడో మీకు తెలుసా…?

Sunil తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు తగ్గ క్రేజ్ ని అందుకున్న నటులు ఎవరైనా ఉన్నారంటే అది కమెడియన్ గా చలామణి అయిన బ్రహ్మానందం అనే చెప్పాలి బ్రహ్మానందం తర్వాత అంత మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన నటుడు సునీల్ ఒకప్పుడు ఏ సినిమాలో చూసుకున్న కమెడియన్ గా సునీల్ మాత్రమే ఉండే వాడు అలాంటి సునీల్ చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు ఆయన చేసే కామెడీకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు […].

By: jyothi

Published Date - Tue - 24 August 21

Sunil: ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిపోయిన సునీల్ ఇప్పుడు ఎంత రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడో మీకు తెలుసా…?

Sunil తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు తగ్గ క్రేజ్ ని అందుకున్న నటులు ఎవరైనా ఉన్నారంటే అది కమెడియన్ గా చలామణి అయిన బ్రహ్మానందం అనే చెప్పాలి బ్రహ్మానందం తర్వాత అంత మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన నటుడు సునీల్ ఒకప్పుడు ఏ సినిమాలో చూసుకున్న కమెడియన్ గా సునీల్ మాత్రమే ఉండే వాడు అలాంటి సునీల్ చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు ఆయన చేసే కామెడీకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు అలా కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో తన రెమ్యూనరేషన్ భారీగా తీసుకునేవాడు అలాంటి సునీల్ అందాల రాముడు సినిమాలో హీరోగా మారాడు ఆ సినిమా మంచి విజయం సాధించింది ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు కానీ దర్శక ధీరుడు రాజమౌళి సునీల్ ని హీరోగా పెట్టి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో ఫుల్ టైం హీరోగా మారిపోయాడు.

ఆ సినిమా తర్వాత సునీల్ మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో వచ్చిన పూలరంగడు సినిమా మంచి విజయాన్ని సాధించింది కానీ ఆ తర్వాత తీసిన అప్పలరాజు, మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో సునీల్ కెరియర్ డీలా పడిందని చెప్పవచ్చు దాంతో సునీల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం స్టార్ట్ చేశాడు దాంట్లో భాగంగానే డిస్కో రాజా సినిమా లో విలన్ గా కూడా నటించాడు అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు దాంతో సునీల్ కి కూడా పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి రీసెంట్ గా హిట్ అయిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా నటించిన సునీల్ కు మంచి పేరు వచ్చింది.

అయితే ఈ సినిమా కోసం సునీల్ 10 రోజుల కాల్షీట్స్ కేటాయించాడు దానికోసం ఆయన రోజుకు లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్నాడు దీంతో 3 కోట్ల నుంచి 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి పడి పోవడం అనేది సునీల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు అయితే ఇది చిన్న సినిమా కాబట్టి తీసుకున్నాడు అనుకుందాం అంటే అలా కాదు ఆయన ఈ మధ్య చేసిన అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాల్లో కూడా ఇదే తరహా రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని తెలుస్తుంది.

సునీల్ త్రివిక్రమ్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే అరవింద సమేత, అలా వైకుంఠపురం లో సినిమాలో మంచి వేషాలను ఇచ్చి సునీల్ ని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు కాదు కెరీర్ మొదట్లో కూడా తను రాసే సినిమాలో సునీల్ కోసం ఒక ప్రత్యేక క్యారెక్టర్ ని డిజైన్ చేసే వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన రాసిన క్యారెక్టర్ల తోనే సునీల్ కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు.అయితే ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిపోయిన సునీల్ పరిస్థితి ఇంతగా దిగజారిపోవడంతో అతని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సునీల్ హీరోగా నిలదొక్కుకోవాలంటే ఒక మంచి కంబ్యాక్ హిట్ సినిమా పడాలి అని ఎదురుచూస్తున్నారు ఈ మధ్య స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ కథ మాటలు అందిస్తున్న వేదాంతం రాఘవయ్య సినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నాడు అలాగే వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు సునీల్ ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించి సునీల్ కి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయో లేదో చూడాలి.

Latest News

Related News