సునీల్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ క్రియేట్‌ చేసిన టాప్ 10 పాత్రలు ఏంటో తెలుసా?

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మరియు కమెడియన్‌ సునీల్‌ లు ఇండస్ట్రీలో ఒకేసారి ప్రయత్నాలు ఆరంభించారు. త్రివిక్రమ్‌ రచయితగా ప్రయత్నాలు చేసే సమయంలో సునీల్‌ కమెడియన్ గా అవకాశాల కోసం తిరిగేవాడు. ఇద్దరు కలిసి ఒకే రూమ్‌ ను షేర్‌ చేసుకున్న విషయాన్ని కూడా గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. సునీల్‌ మొదట ఆఫర్లు దక్కించుకున్నాడు. సునీల్ తనకున్న పరిచయాల ద్వారా త్రివిక్రమ్‌ ను ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. అలా త్రివిక్రమ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టడంకు కారణం […].

By: jyothi

Published Date - Sun - 23 May 21

సునీల్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ క్రియేట్‌ చేసిన టాప్ 10 పాత్రలు ఏంటో తెలుసా?

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మరియు కమెడియన్‌ సునీల్‌ లు ఇండస్ట్రీలో ఒకేసారి ప్రయత్నాలు ఆరంభించారు. త్రివిక్రమ్‌ రచయితగా ప్రయత్నాలు చేసే సమయంలో సునీల్‌ కమెడియన్ గా అవకాశాల కోసం తిరిగేవాడు. ఇద్దరు కలిసి ఒకే రూమ్‌ ను షేర్‌ చేసుకున్న విషయాన్ని కూడా గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. సునీల్‌ మొదట ఆఫర్లు దక్కించుకున్నాడు. సునీల్ తనకున్న పరిచయాల ద్వారా త్రివిక్రమ్‌ ను ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. అలా త్రివిక్రమ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టడంకు కారణం సునీల్‌ అయ్యాడు. రచయితగా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న త్రివిక్రమ్‌ తన స్నేహితుడు సునీల్‌ కు తాను రాసే కథల్లో మంచి పాత్రలను క్రియేట్‌ చేసేవాడు. త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయం కాకముందు నుండే తాను రాసిన కథల్లో ప్రత్యేంగా కామెడీ పాత్రలను క్రియేట్‌ చేసి దర్శకులను ఒప్పించి సునీల్‌ తో ఆ పాత్రలను చేయించేవాడు. సునీల్‌ కెరీర్‌ ఆరంభంలో త్రివిక్రమ్‌ క్రియేట్‌ చేసిన పాత్రల వల్లే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. త్రివిక్రమ్‌ రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా మారడంలో సునీల్‌ పాత్ర ఎంతగా ఉందో.. సునీల్‌ స్టార్‌ కమెడియన్ గా మారడంలో కూడా త్రివిక్రమ్‌ పాత్ర అంత ఉంది అనడంలో సందేహం లేదు. ఇద్దరు మిత్రులు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా సాయం చేసుకుని వారి వారి కెరీర్ లో సక్సెస్‌ లను దక్కించుకున్నారు. త్రివిక్రమ్‌ రాసిన కథల్లో సునీల్‌ కు దక్కిన 10 మంచి పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

1. చిరు నవ్వుతో సినిమాలో సునీల్‌ గా… వేణు హీరోగా జి రామ్ ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన చిరు నవ్వుతో సినిమాకు త్రివిక్రమ్‌ రచయితగా వ్యవహరించాడు. ఆ సినిమాలో సునీల్‌ కోసం అదే పేరుతో త్రివిక్రమ్‌ పాత్రను క్రియేట్‌ చేశాడు. ఆ సినిమాలోని పాత్ర సునీల్‌ కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత సునీల్ కు వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యింది.

2. నవ్వు నాకు నచ్చావ్‌ లో బంతిగా… వెంకటేష్‌ హీరోగా ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్‌ గా కె విజయభాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో త్రివిక్రమ్‌ రచయితగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తనతో పాటు సునీల్ కు కూడా ఎప్పటికి గుర్తుండి పోయే పాత్రను ఇచ్చాడు. అమాయకంగా కనిపిస్తూనే గడుసుగా ఉండే పని వాడి పాత్రలో సునీల్ కనిపించాడు. వెంకటేష్‌ మరియు ఎమ్మెస్‌ నారాయణలతో సునీల్ చేసిన కామెడీ ఇప్పటికి నవ్వు తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. బంతి పాత్రతో సునీల్‌ రేంజ్ మరింతగా పెరిగింది.

3. నువ్వే నువ్వేలో పండుగా.. త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయం అయిన మొదటి సినిమా ఇది. రచయితగానే సునీల్ కు చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్‌ తన దర్శకత్వంలో సినిమా అంటే సునీల్‌ కు మరెంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో పండు పాత్ర సినిమా కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హీరో తరుణ్‌ తో సినిమా మొత్తం కంటిన్యూ అయ్యే పాత్ర పండు. నువ్వే నువ్వే సినిమా కామెడీ భారం అంతా కూడా సునీల్‌ పై వేసి త్రివిక్రమ్‌ నడిపించాడు. అందుకే పండుగా సునీల్‌ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.

4. వాసు లో బాలుగా.. వెంకటేష్‌ హీరోగా నటించిన వాసు సినిమా కు కరుణాకరణ్‌ దర్శకత్వం వహించగా మాటలను త్రివిక్రమ్‌ అందించాడు. ఈ సినిమాలో కూడా సునీల్‌ కోసం మంచి పంచ్ డైలాగ్‌ లను రాశాడు త్రివిక్రమ్‌. ఆ డైలాగ్స్ తో సినిమాకు సునీల్‌ పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

5. మన్మధుడులో బంక్ శీనుగా… నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమా లో సునీల్‌ పాత్ర చిన్నదే అయినా కూడా ఇప్పటికి ఎప్పటికి నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బంక్ శీనుగా ఈ సినిమా లో సునీల్‌ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. దానికి తోడు ఆయన డైలాగ్స్ సినిమాకు హైలైట్‌ గా నిలిచాయి. ఈ సినిమా కు విజయ భాస్కర్‌ దర్శకుడు అయితే రచయిత త్రివిక్రమ్‌.

6. అతడులో రమణగా.. మహేష్‌ బాబు తో త్రివిక్రమ్‌ తెరకెక్కంచిన ఈ సినిమా లో సునీల్ రమణగా కనిపించి మెప్పించాడు. కన్ఫ్యూజ్‌ మరియు కంగారు స్నేహితుడి పాత్రలో సునీల్ ను త్రివిక్రమ్‌ చక్కగా చూపించాడు. అప్పటికే సునీల్‌ స్టార్‌ కమెడియన్ గా పేరు దక్కించుకున్నాడు. ఆ సమయంలో సునీల్‌ కు రమణ పాత్ర మరింత బూస్టింగ్ ఇచ్చింది.

7. జై చిరంజీవ సినిమాలో ధనుష్‌ కోటిగా… మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవి సినిమాకు విజయ భాస్కర్‌ ధర్శకత్వం వహించగా త్రివిక్రమ్‌ రచయితగా వ్యవహరించాడు. ఎప్పటిలాగే ఈ సినిమా లో కూడా సునీల్‌ కోసం ఒక ఇన్నోసెంట్‌ పాత్రను త్రివిక్రమ్‌ క్రియేట్‌ చేశాడు. సినిమా నిరాశ పర్చినా కూడా సునీల్‌ పాత్ర మాత్రం ఎప్పటికి మర్చి పోలేకుండా నిలిచి పోయింది. ఇలాంటి అమాయకులు కూడా ఉంటారా అనుకునేలా సునీల్‌ నటించి మెప్పించాడు.
8. జల్సా లో శీనుగా.. పవన్‌ కళ్యాణ్‌ తో త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ సినిమా కథ లో శీను పాత్రకు ప్రాముఖ్యత లేదు. కాని హీరోయిన్ తో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ ను త్రివిక్రమ్‌ ఇచ్చాడు. సునీల్‌ తో ఉన్న స్నేహం కారణంగానే పవన్‌ మూవీ లో ఆ పాత్రను జొప్పించి మరీ త్రివిక్రమ్‌ స్నేహితుడికి అవకాశం ఇచ్చాడు.
9. మళ్లీశ్వరి లో పద్దుగా… వెంకటేష్‌ హీరోగా విజయ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్‌ రచయితగా వ్యవహరించాడు. ఈ సినిమా లో కూడా పద్దు పాత్ర కథలో భాగం కాదు. అయినా కూడా ప్రత్యేకంగా సునీల్‌ కోసం ఆ పాత్రను త్రివిక్రమ్‌ రాసినట్లుగా చెబుతూ ఉంటారు. మళ్లీశ్వరి సినిమా సక్సెస్ లో పద్దు పాత్ర ఎంతటి పాత్ర పోషించిందో అందరికి తెల్సిందే.
10. ఖలేజా లో బబ్జీగా… మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ చేసిన రెండవ సినిమా ఖలేజాలో కూడా సునీల్‌ కు కీలక పాత్ర ఇచ్చాడు. మహేష్‌ బాబుతో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రను సునీల్‌ పోషించాడు. మహేష్‌ బాబు, అనుష్క, సునీల్ ల కాంబోలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా ప్లాప్‌ అయినా కూడా బాబ్జీ భయ్య అనే పేరు బాగా ఫేమస్‌ అయ్యింది. 

ఇలా కేవలం సునీల్‌ తో ఉన్న స్నేహంతో త్రివిక్రమ్‌ తన సినిమా ల్లో కథలో భాగం కాకున్నా పాత్రలను క్రియేట్‌ చేశాడు. సునీల్‌ కెరీర్ లో ఇంతటి స్థాయికి చేరుకునేలా చేశాడు. సునీల్‌ హీరోగా త్రివిక్రమ్‌ ఒక సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి కాని అవి కార్యరూపం దాల్చలేదు. సునీల్‌ హీరోగా చేస్తున్న సమయంలో కాస్త గ్యాప్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ మళ్లీ తన సినిమాల్లో సునీల్ కు ఛాన్స్‌ ఇస్తున్నాడు. త్వరలో మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమాలో కూడా సునీల్‌ కు ఒక మంచి పాత్ర ఉండే ఉంటుంది.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News