అద్దె గర్భం: సన్నీలియోన్ అంత పెద్ద తప్పు చేసిందా.?

సన్నీలియోన్ అనగానే ఒకప్పుడు ఆమె నటించిన పోర్న్ సినిమాల గురించిన చర్చ వచ్చేది. ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకోవడం మొదలు పెట్టిందో, అంతకు ముందు ఆమె అడల్ట్ సినిమాల్లో నటించిన విషయాన్ని చాలామంది మర్చిపోయారు. సన్నీలియోన్, తన భర్త డేనియల్ వెబర్ కలిసి ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఓ పెద్ద సంచలనం. కానీ, సన్నీలియోన్ – డేనియల్ వెబర్ దంపతులకు మొత్తం సంతానం ముగ్గురు. అదెలా.? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు […].

By: jyothi

Updated On - Wed - 12 May 21

అద్దె గర్భం: సన్నీలియోన్ అంత పెద్ద తప్పు చేసిందా.?

సన్నీలియోన్ అనగానే ఒకప్పుడు ఆమె నటించిన పోర్న్ సినిమాల గురించిన చర్చ వచ్చేది. ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకోవడం మొదలు పెట్టిందో, అంతకు ముందు ఆమె అడల్ట్ సినిమాల్లో నటించిన విషయాన్ని చాలామంది మర్చిపోయారు. సన్నీలియోన్, తన భర్త డేనియల్ వెబర్ కలిసి ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఓ పెద్ద సంచలనం. కానీ, సన్నీలియోన్ – డేనియల్ వెబర్ దంపతులకు మొత్తం సంతానం ముగ్గురు. అదెలా.? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే వున్నాయ్. పదండిక అవేంటో తెలుసుకుందాం.

దత్తత ప్లస్ అద్దె గర్భం..

సన్నీలియోన్ ఓ చిన్నారిని దత్తత తీసుకుందని ముందే చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సరోగసీ.. అదేనండీ అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఎందుకిలా.? అంటే, ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అయితే, సన్నీలియోన్ తల్లి అయ్యేందుకు అనుకూల పరిస్థితుల లేవట. అది అడల్ట్ సినిమా కెరీర్ ప్రభావం అంటారు కొందరు. కారణం ఏదైతేనేం, ముచ్చటగా ముగ్గురు పిల్లలతో సన్నీలియోన్ – డేనియల్ వెబర్ దంపతులు ఫుల్ హ్యాపీ.

అమీర్ ఖాన్.. కొంచెం అలా, కొంచెం ఇలా

అమీర్ ఖాన్ – రీనా దంపతులకు జుబైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే, రీనాతో విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్, ఆ తర్వాత కిరణ్ రావుని పెళ్ళాడాడు. కిరణ్ రావు – అమీర్ ఖాన్, సరోగసీ విధానంలో తల్లిదండ్రులయ్యారు. అలా సరోగసీ విధానం ద్వారా జన్మించిన కుర్రాడే ఆజాద్ రావు. కిరణ్ రావుకి వున్న అనారోగ్య సమస్యల నేపథ్యంలోనే అమీర్ ఖాన్, సరోగసీ వైపు మొగ్గు చూపాడు.

షారుక్ ఖాన్ – గౌరీ ఖాన్.. ఈ ఇద్దరిదీ ఇంకో కథ

షారుక్ ఖాన్ – గౌరీ ఖాన్.. ఈ జంటకి ఇద్దరు పిల్లలు సాధారణ పద్ధతిలోనే జన్మించారు. అయితే, మూడో బిడ్డ విషయంలో మాత్రం సరోగసీని ఆశ్రయించింది ఈ జంట. ఎందుకిలా.? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, షారుక్ – గౌరీ ఖాన్.. మూడో బిడ్డ కోసం ఎందుకు ప్రయత్నించిందన్నదానిపై రకరకాల కథనాలు, బోల్డన్ని విమర్శలూ వున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది.

తుషార్ కపూర్, ఏక్తా కపూర్.. ఈ కథ చాలా ప్రత్యేకం

తుషార్ కపూర్ పెళ్ళి చేసుకోలేదు.. కానీ, అతనికి ఓ కొడుకు వున్నాడు. ఏక్తా కపూర్ కూడా పెళ్ళి చేసుకోలేదు.. కానీ, ఆమెకీ ఓ కొడుకున్నాడు. చిత్రమేంటంటే, అక్క ఏక్తా కపూర్.. తమ్ముడు తుషార్ కపూర్.. ఇద్దరూ విడి విడిగా సరోగసీ లాంటి ప్రత్యేక విధానం ద్వారానే ఒకరు తల్లి, ఇంకొకరు తండ్రి.. విడి విడిగా అయ్యారు. ఇద్దరూ సింగిల్ పేరెంట్స్. బాలీవుడ్ చరిత్రలోనే ఇదో ప్రత్యేకమైన కథ.

తెలుగునాట మంచు లక్ష్మి కూడా..

తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే, మంచు లక్ష్మి కూడా సరోగసీ విధానం ద్వారానే తల్లి అయ్యారు.ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కూడా సింగిల్ పేరెంట్. అతనికీ ఇద్దరు పిల్లలున్నారు.. ఇది కూడా సరోగసీ లాంటి వ్యవహారమే. నిజానికి, సరోగసీ.. అదేనండీ, అద్దె గర్భం అనేది ఇప్పుడు చాలామందికి వారెదుర్కొంటున్న అతి పెద్ద సామాజిక సమస్య నుంచి ఊరట కల్పిస్తోంది. సహజ పద్ధతుల్లో పిల్లల్ని కనే అవకాశం లేని తల్లిదండ్రులకు సరోగసీ ఓ వరం. దాన్ని సెలబ్రిటీలు సద్వినియోగం చేసుకుంటే అదో పెద్ద వార్త.. అంతే.

 

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News