Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఎంత కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా సరే ఆయన కష్టం మీదనే ఆయన స్టార్ హీరో అయ్యాడని చెప్పుకోవాలి. ఇక ఎంటైర్ కెరీర్ లో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేయలేదనే చెప్పుకోవాలి.
అలాంటి మహేశ్ బాబు కూడా కెరీర్ లో కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. రెండుసార్లు అయితే ఆయన కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. అప్పుడు ఓ డైరెక్టర్ ఆదుకున్నారు. మహేశ్ బాబుకు వన్ నేనొక్కడినే, ఆగడు లాంటి భారీ ప్లాప్ సినిమాల తర్వాత కొరటాళ శివ ఆదుకున్నాడు.
ఆయన డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు మహేశ్ బాబు కెరీర్ ను మళ్లీ నిలబెట్టింది. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని మైలురాయిగా నిలిచి పోయింది. దీని తర్వాత మహేశ్ కు మళ్లీ వరుసగా రెండు ప్లాపులు వచ్చాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి భారీ ప్లాపులు వచ్చాయి.
Super Star Mahesh Babu Faced Severe Difficulties At Times In Career
దాంతో మళ్లీ ఆయన కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పుడు కూడా మళ్లీ కొరటాల శివ హెల్ప్ చేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. దాంతో మళ్లీ మహేశ్ కెరీర్ ఊపందుకుంది. దాని తర్వాత వరుసగా హిట్లు కొడుతున్నాడు మహేశ్ బాబు.
Also Read : Sai Pallavi : స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడ్డ సాయిపల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు..!
Also Read : Anchor : ఈ బోల్డ్ యాంకర్ ను గుర్తు పట్టారా.. సారీ ఫంక్షన్ ఫొటోలు వైరల్..!