Surekha Konidela : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న గౌరవ మర్యాదలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. కాగా ఆయన భార్య సురేఖ అంటూ కూడా అందరికీ బాగా పరిచయం.
ఆమె ఓర్పు, సహనం, త్యాగానికి పెట్టింది పేరు. పవన్ కల్యాణ్ ను సొంత కొడుకులా చూసుకుంది. పవన్ స్టార్ హీరో అవ్వడానికి కూడా ఆమెనే కారణం. అలాంటి సురేఖను అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ దారుణంగా అవమానించిందంట. ఆ విషయం అప్పట్లో బాగా వైరల్ అయింది కూడా.
ఓ ఈవెంట్ లో సురేఖను చూసిన సదరు స్టార్ హీరోయిన్.. చులకనగా మాట్లాడిందంట. చిరంజీవి భార్య కాబట్టి ఎలా ఉన్నా సరిపోతుందిలే అంటూ ఎగతాలిగా మాట్లాడిందంట. ఇది ఒక రకంగా తనను అవమానించడమే అని సురేఖ భావించింది. ఇదే విషయాన్ని ఆమె చిరంజీవికి కూడా చెప్పింది.
సదరు స్టార్ హీరోయిన్ తో చిరంజీవి కొన్ని సినిమాలు కూడా చేశారు. ఆ పరిచయంతోనే ఆమెను కాస్త స్వీట్ గానే మందలించారంట. ఇంకోసారి అలాంటి కామెంట్లు చేయొద్దంటూ చెప్పారంట చిరంజీవి. దాంతో ఆ స్టార్ హీరోయిన్ కూడా సారీ చెప్పింది సురేఖకు. ఆ విషయం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
Read Also : Ramya krishna : రమ్యకృష్ణను లైంగికంగా వేధించిన స్టార్ డైరెక్టర్.. చివరకు దారుణం..!
Read Also : Allu Arjun : ప్రైవేట్ జెట్.. లగ్జరీ కార్లు.. అల్లు అర్జున్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా…?