Surekha Vani : ఈ నడుమ టాలీవుడ్ నటీమణులు బాగా రెచ్చిపోతున్నారు. కావాలని ఇలాంటి మాటలు అంటున్నారో లేకపోతే ఏదో చెప్పబోయి ఇంకొకటి చెబుతున్నారో అర్థం కావట్లేదు. కానీ వారు చేస్తున్న బోల్డ్ కామెంట్లు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సురేఖ వాణి కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె టాలీవుడ్ లో ఎన్నో పాత్రలు చేసింది. కమెడియన్లకు భార్యగా చాలా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కువగా ఇన్ స్టాలో పోస్టులు పెడుతోంది. అయితే రీసెంట్ గా ఆమె తన కూతురుతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా మీరు ఎవరితో అయినా డేటింగ్ చేయాలని అనుకుంటున్నారా అని యాంకర్ అడగ్గా.. అవును నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఒక్క రోజు అయినా ఆయనతో డేటింగ్ చేయాలని ఉంది. ఆయన ఒప్పుకుంటే 100 ముద్దులిస్తా అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.
ఇక పక్కనే ఉన్న సుప్రీత మరింత రెచ్చిపోయి.. మా అమ్మకు నాగార్జన అంటే కూడా చాలా ఇష్టం. ఆయనతో కూడా డేటింగ్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. వీరిద్దరి మాటలు విన్న నెటిజన్లు.. మీరు ఇలా బరితెగించారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read Also : Suma kanakala : రాజీవ్ కంటే ముందు ఆ డైరెక్టర్ తో రొమాన్స్ చేసిన సుమ.. ఎవరంటే..
Read Also : Jagapathi Babu : ఆ గ్లామరస్ హీరోయిన్ తో కూడా జగపతిబాబు ఎఫైర్ నడిపారా..?