Taapsee Pannu : హీరోయిన్లు కావాలనే తపనతో చాలామంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అలాంటి వారు ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు కూడా ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కు గురైన సందర్భాలు ఉన్నాయి. అయితే మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి స్పందిస్తున్నారు.
ఇక తాజాగా హీరోయిన్ తాప్సి కూడా స్పందించింది. ఆమె మొన్నటి వరకు టాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఆమె పెద్ద హీరోయిన్ గా ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనలపై స్పందిస్తూనే వస్తోంది.
తాజాగా తాప్సి హీరోయిన్లకు ఎదురయ్యే కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. నాకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురయింది. ఓ ఇద్దరు హీరోలు డైరెక్టుగానే నన్ను కమిట్ మెంట్లు అడిగారు.
కానీ నేను ఒప్పుకోలేదు. చివరకు ఆ ఇద్దరు హీరోల సినిమాల్లో నుంచి నన్ను తీసేశారు. అయినా సరే నేను బాధ పడలేదు. పట్టుదలతోనే ముందుకు వెళ్లాను. నా ట్యాలెంట్ తోనే సినిమాల్లో అవకాశాలు అందుకున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది తాప్సీ.
Read Also : Salman Khan : సల్మాన్ డేటింగ్ చేసిన హీరోయిన్స్ ఎంతమందో తెలుసా.. లిస్టు పెద్దదే!
Read Also : Mega Family Heroes : మెగా హీరోలను తిట్టి ఛాన్సులు కోల్పోయింది వీరే.. ఎవరెవరంటే..?