తమన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా మారిపోయింది. రీసెంట్ గానే ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు విడుదల అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న లస్ట్ స్టోరీస్-2 కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సిరీస్ లో తమన్నా చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతున్నారు.
తమన్నా సినీ కెరీర్ లో మొదటిసారిగా లిప్ కిస్ లు కూడా ఇచ్చింది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్ లో ఆమె చేస్తున్న కామెంట్లు నేషనల్ వైడ్ గా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ మీద మరోసారి స్పందించింది. వాస్తవానికి నేను బాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేశాను.
ఒక సినిమా చేసిన తర్వాత నాకు ఓ నిర్మాణ సంస్థ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సరే అని వెళ్లాను. అక్కడ ఆ నిర్మాత మేనేజర్ నాతో మాట్లాడాడు. మిమ్మల్ని మా సినిమాలో తీసుకుంటాం. కానీ ఒకసారి మీరు నిర్మాతను గెస్ట్ హౌస్ లో కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతా ఆయనే చూసుకుంటారు. అంటూ నీచంగా మాట్లాడాడు.
దాంతో నాకు మ్యాటర్ అర్థం అయింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. బాలీవుడ్ లో ముందు ముందు ఇలాగే ఉంటుందేమో అని భయం వేసింది. అందుకే సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్లాను. అక్కడే మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ నుంచి ఛాన్సులు రావడం సంతోషంగా ఉంది అంటూ తెలిపింది తమన్నా. కానీ నిర్మాత పేరు మాత్రం బయటపెట్టలేదు.
Read Also : Kasturi Shankar Reacts On Casting Couch : వాళ్ల పక్కలో పడుకుంటే స్టార్ డమ్ రాదు.. కస్తూరి శంకర్ సంచలనం..!