Tamannaah Bhatia : సినిమా రంగం అంటేనే చెడు అలవాట్లకు కేరాఫ్ అడ్రస్ అనే ఒక అపవాదు ఉంది. ఇక్కడ ఉండే నటులు, డైరెక్టర్లు, నిర్మాతలకు కచ్చితంగా ఏదో ఒక చెడ్డ అలవాటు ఉంటుందని ఎప్పటి నుంచో కామెంట్లు చేస్తున్నారు. బయటి జనాలు అనుకున్నట్టు గానే ఇండస్ట్రీలో ఉండే చాలామందికి సిగరెట్, మందు అలవాటు ఉంటుంది.
కేవలం మగవారికే కాదు హీరోయిన్లు, నటీమణులకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఇప్పటి జనరేషన్ లో అయితే కామన్ అయిపోయాయి. చాలామంది హీరోయిన్లకు ఎక్కువగా సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ తమన్నాకు కూడా ఓ చెత్త అలవాటు ఉందని అంటున్నారు.
ఆమె మొన్నటి వరకు సౌత్ ఇండస్డ్రీలో టాప్ హీరోయిన్ గా ఊపేసింది. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తోంది. ప్రస్తుతం ఆమె లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.
తమన్నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందంట. ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆమె సినిమా సమయంలో కూడా సెట్స్ లో సిగరెట్ తాగుతుందంట. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతుందని తెలుస్తోంది. ఈ అలవాటును ఆమె మానలేకపోతుందని అంటున్నారు నెటిజన్లు.
Read Also : Akhil Akkineni : అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడానికి ఆ అమ్మాయే కారణమా..?
Read Also : Actress Pragathi : 5 నిముషాల సుఖం కోసం కోట్లు పెట్టరు.. నటి ప్రగతి కామెంట్లు వైరల్..!