Star Hero And Heroines : ఇప్పటి జనరేషన్ లో శరీరం మీద టాటూలు వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అయితే మన సెలబ్రిటీలు కూడా తమ బాడీ మీద టాటూలు వేయించుకుంటున్నారు. ఆ టాటూలు కూడా ప్రత్యేక అర్థం వచ్చే విధంగా వేయించుకుంటున్నారు. మరి ఎవరెవరు ఏమేం టాటూలు వేయించుకున్నారో, వాటి మీనింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాప్సీ..
హీరోయిన్ తాప్సీ కాలు మీద ఒక అమ్మాయి టాటూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే.. స్వేచ్ఛగా ఆలోచించే తత్వాన్ని సూచిస్తుంది.
అనసూయ..
హాట్ యాంకర్ అనసూయకు చెస్ట్ మీద ఒక టాటూ ఉంటుంది. దాన్ని కలోన్ అని గ్రీకు పదంలో రాయించుకుంది. అంటే ఎవరినీ ఫాలో కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే అన్ అపాలొజిటిక్ అని అర్థం. అలాగే మెడ మీద నిక్కు అని రాసి ఉంటుంది. అది ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ నిక్ నేమ్.
శృతిహాసన్…
శృతిహాసన్ కు కూడా మెడపై వెనక భాగంలో తమిళ్ లో తన పేరు రాసి ఉంటుంది. అలాగే చేతిపై గులాబీ పువ్వు టాటూ, భుజం మీద, కాలి మీద కూడా టాటూలు ఉన్నాయి. ఆమెకు మొత్తంగా ఐదు టాటూలు ఉన్నాయి.
సమంత..
స్టార్ హీరోయిన్ సమంత మెడ మీద వైఎంసీ అని రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే.. ఆమె చేసిన మొదటి మూవీ ఏం మాయ చేశావే అని అర్థం. అలాగే నడుము మీద చై అని పేరు రాసి ఉంటుంది. దాని అర్థం నాగచైతన్య పేరు. ఆమె చేతిపై కూడా రెండు వి అక్షరాలు రాసి ఉంటాయి. అంటే పాజిటివ్ గా ఆలోచించాలి అని అర్థం.
రష్మిక మండన్నా..
రష్మిక మండన్నా చేతి మీద ఇర్రీప్లేసబుల్ అని రాసి ఉంటుంది. ఈ టాటూను కేవలం తన కోసమే వేయించుకుంది రష్మిక. దాని అర్థం ఏంటంటే.. తనను ఎవరూ భర్తీ చేయలేరని అర్థం.
నయనతార..
నయనతార గతంలో ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు తన చేతి మీద ప్రభు అనే పేరును టాటూగా వేయించుకుంది. కానీ తర్వాత వీరిద్దరూ విడిపోవడంతో ఆ టాటూని కొంచెం మార్చి పాజిటివిటీ అని అర్థం వచ్చే విధంగా మార్చుకుంది.
ఇలియానా..
గోవా బ్యూటీ ఇలియానా చేతి మీద ఇన్ స్పిరేర్ అని ఉంటుంది. ఇది ఒక లాటిన్ పదం. దాని మీనింగ్ స్ఫూర్తి అని వస్తుంది. అలాగే చేతికి మరో వైపు మూడు చుక్కలు ఉంటాయి. ఇవి ఆమె తన సిస్టర్స్ ను సూచిస్తాయంట. వీపుమీద ఒక పక్షి రెక్కలు విప్పుకొని ఎగురుతున్నట్టు ఉండే ఒక టాటూ ఉంటుంది.
త్రిష..
హీరోయిన్ త్రిష మెడ మీద నీమో అని టాటూ ఉంటుంది. వీపుపై నటన మీద ఉన్న ఇష్టాన్ని చూపించేందుకు క్లాప్ బోర్డు టాటూ వేయించుకుంది. అలాగే తన మణికట్టు మీద తన రాశి అయిన వృషభం గుర్తు కూడా టాటూ గా వేయించుకుంది.
నిహారిక..
నిహారిక వీపు మీద ఒక పక్షి టాటూను వేయించుకుంది. దానికి అర్థం ఏంటంటే స్వేచ్ఛ అని వస్తుంది.
నమ్రతా శిరోద్కర్..
సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత కుడి చేతి మీద మూడు టాటూలు వేయించుకుంది. ఆ మూడు మహేశ్, గౌతమ్, సితార పేర్లు.
లక్ష్మీ మంచు..
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ వీపు మీద టాటూ ఉటుంది. దాని మీనింగ్ ఏంటంటే.. వాట్ యు సీక్ ఈజ్ సీకింగ్ యు. అంటే నువ్వు ఏమి ఇష్టపడుతున్నావో అది నిన్ను కూడా ఇష్టపడుతోంది అని ఆ టాటూ అర్థం.
షాలిని పాండే..
హాట్ హీరోయిన్ షాలినీ పాండే కాలి మీద 2 మాస్కులు మధ్యలో ఒక మ్యూజిక్ నోట్ ఉన్నట్టు టాటూ వేయించుకుంది. దాని అర్థం ఏంటంటే.. రెండు ముఖాల్లో ఒక ముఖం.. అంటే ఒక వ్యక్తిని మరొక ముఖం ఆ వ్యక్తి తెర మీద చూపించే నటనను చూపిస్తుంది.
నాగార్జున..
Tattoos Worn By Star Hero And Heroines Have Special Feature
అక్కినేని నాగార్జున ఎడమ చేతిపై ఓ టాటూను వేయించుకున్నారు. చేతిపై నాగుపాము, పైన కంపస్, మధ్యలో కన్ను మీద ఎన్ అని రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే.. పాము పొలుసులు వదిలేసినట్లే నేను నా వెనక ఉన్న బ్యాగేజ్ అంతా వదిలేస్తాను అని అర్థం. గతం గత: అనే ధోరణితో ఇది వేయించుకున్నాడు నాగ్.
నాగచైతన్య..
అక్కినేని నట వారసుడు నాగచైతన్య చేతిపై ఓ టాటూ వేయించుకున్నాడు. అది మోర్స్ కోల్ లో ఉన్న ఒక తేదీ. ఇంతకీ ఆ తేదీ ఏదో కాదండోయ్.. సమంతతో తన పెండ్లి జరిగిన తేదీని ఇలా వేయించుకున్నాడు చైతూ. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని చెరిపేయకుండా అలాగే ఉంచుకున్నాడు.
Also Read : Pawan Kalyan : వంద కోట్ల క్లబ్ లో చేరని ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Also Read : Nandamuri Balakishna : బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా.. అప్పట్లో బయట పడ్డ నిజం ఇదే..!