Tejaswi madivada : ఐస్ క్రీం బ్యూటీ తేజస్వీ ముదివాడ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయమే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మత్తెక్కించే ఫొటోలను పోస్ట్ చేస్తూ అందాల డోసును పెంచుకుంటూ పోతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ తర్వాత ఒక్కసారిగా హాట్ గా తయారయింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ఐస్ క్రీమ్ సినిమాతో ఒక్క సారిగా ఈ బ్యూటీ తన అందాల ఆరబోతను ప్రదర్శించింది.
tejaswi madivada
ఈ సినిమాలో బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అప్పటి నుంచి వరుసగా బ్యూటీకి గ్లామర్ రోల్స్ వచ్చి పడుతున్నాయి. ఇలాగే తను సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన బోల్డ్ బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు హీటు పెంచేస్తుంది. 1991లో జన్మించిన తేజస్వీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసింది. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క డ్యాన్స్ నేర్చుకుంది.
tejaswi madivada
తేజస్వి చిన్ననాటి నుంచే డ్యాన్స్ తెగ ఇరగదీస్తుంది. చిన్ననాటే కూచిపూడిలో ప్రావీణ్యం సంపాధించిన ఈ బ్యూటీ తర్వాత వెస్టర్న్ డ్యాన్స్ పైనా ఫోకస్ చేసింది. చదువును ఎక్కడ ఆపేయకుండా డ్యాన్స్ నేర్చేసుకుంది. ఈ బ్యూటీ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా బిజీగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి 7 అప్ యాడ్ ను ఈ బ్యూటీ ఫస్ట్ చేసింది. తర్వాత మహేశ్ హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం వచ్చింది.
tejaswi madivada