• Telugu News
  • movies

Telengana Heroes and Directors : టాలీవుడ్‌లో సత్తా చాటిన తెలంగాణ హీరోలు, దర్శకులు వీరే..

Telengana Heroes and Directors : సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావడం అంత ఈజీ కాదు. హీరోగా, డైరెక్టర్‌గా గుర్తింపు పొందడం ఎంత కష్టమో అనేక సందర్భాల్లో చాలా మంది చెప్పారు. టాలీవుడ్‌లో తెలంగాణకు చెందిన టెక్నిషియన్స్ తక్కువే అని చెప్పాలి. తెలుగు సినిమా పురుడు పోసుకుని 8 దశాబ్దాలపైనే అయినా.. తెలంగాణకు చెందిన వారు తక్కువే. అయితే, కొంతకాలంగా తెలంగాణకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు సత్తాచాటుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.. ఇటీవల చిన్న […].

By: jyothi

Published Date - Fri - 26 November 21

Telengana Heroes and Directors  : టాలీవుడ్‌లో సత్తా చాటిన తెలంగాణ హీరోలు, దర్శకులు వీరే..

Telengana Heroes and Directors : సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావడం అంత ఈజీ కాదు. హీరోగా, డైరెక్టర్‌గా గుర్తింపు పొందడం ఎంత కష్టమో అనేక సందర్భాల్లో చాలా మంది చెప్పారు. టాలీవుడ్‌లో తెలంగాణకు చెందిన టెక్నిషియన్స్ తక్కువే అని చెప్పాలి. తెలుగు సినిమా పురుడు పోసుకుని 8 దశాబ్దాలపైనే అయినా.. తెలంగాణకు చెందిన వారు తక్కువే. అయితే, కొంతకాలంగా తెలంగాణకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు సత్తాచాటుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం..

telengana directors and heroes

telengana directors and heroes


ఇటీవల చిన్న సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకున్న మూవీ ‘జాతి రత్నాలు’. ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్, నిర్మాత నాగ్ అశ్విన్ ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. నాలుగేళ్ల క్రితం ‘పెళ్లి చూపులు’ పెద్ద విజయం అందుకుంది. ఈ మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ తెలంగాణకు చెందిన వారే. ఈ సినిమా 2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. తరుణ్ భాస్కర్ ఉత్తమ మాటల రచయితగా జాతీయ అవార్డు అందుకున్నారు. విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు.

naga aswin and anudeep

naga aswin and anudeep

అలాగే, తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన హీరో నితిన్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. వీరితోపాటు బాబు మోహన్, వేణుమాధవ్ కమెడియన్లుగా రాణించారు. అలాగే, తెలంగాణకు చెందిన దర్శకులు కూడా ఇటీవల తమ సత్తా చాటుతున్నారు. హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్, నీది నాది ఒకటే జీవితం ఫేమ్ వేణు ఉడుగుల, సాగర్ చంద్ర, తరుణ్ భాస్కర్, ఛలో మూవీ డైరెక్టర్ వెంకీ కుడుముల, అనుదీప్, వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు, ఎన్.శంకర్ వంటి వారు టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్‌లు అందుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, సుధాకర్ రెడ్డి మంచి సినిమాలు నిర్మిస్తూ టాప్ డైరెక్టర్‌లుగా ఎదిగారు.

telengana directorstelengana directors

telengana directors


టాలీవుడ్‌లో ప్రస్తుతం తెలంగాణకు చెందిన హీరోలు, డైరెక్టర్లు సత్తా చాటుతున్నా.. గతంలో కూడా చాలా మంది కళాకారులు ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకున్నారు. అందులో ముఖ్యంగా నటుడు పైడి జైరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలోని కరీంనగర్‌లో పుట్టిన జైరాజ్.. తెలుగులో ఒక్క సినిమాలో నటించకపోయిన.. బాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. 1980లో పైడి జైరాజ్‌ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

telengana directors

telengana directors

telengana directors and heroes

telengana directors and heroes


అలాగే, జానపద హీరోగా కత్తి కాంతారావు తన నటనతో అప్పట్లోనే ఐడెంటిటీని క్రియేట్ చేశాడు. తెలంగాణకు చెందిన శ్యామ్ బెనగళ్ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికుడు ఉండరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ దర్శకుడు బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన టాలెంట్‌కు కేంద్రం ‘పద్మశ్రీ’ బిరుదుతో గౌరవించింది. అంతేకాకుండా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత, మెదక్ జిల్లాకు చెందిన దర్శకుడు బి.నరసింగ్ రావు ‘దాసి’,‘మట్టి మనుషులు’,‘మా భూమి’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ‘కొమురం భీమ్’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలంగాణకు చెందిన వారే.

telengana directors and heroes

telengana directors and heroes

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News