Heroes Played Three Roles: తెలుగు హీరోలు త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Heroes Played Three Roles: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ ,శోభన్ బాబు లాంటి హీరోలు అగ్ర హీరోగా గుర్తింపు పొందారు అయితే అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోలు ఎక్కువగా ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు త్రిపాత్రాభినయం అనేది చాలా అరుదుగా అయిపోయింది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎవరెవరు ఎన్ని సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారో ఒకసారి మనం తెలుసుకుందాం… ఎన్టీఆర్ ఎన్టీఆర్ దాన వీర […].

By: jyothi

Updated On - Wed - 20 October 21

Heroes Played Three Roles: తెలుగు హీరోలు త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Heroes Played Three Roles: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ ,శోభన్ బాబు లాంటి హీరోలు అగ్ర హీరోగా గుర్తింపు పొందారు అయితే అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోలు ఎక్కువగా ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు త్రిపాత్రాభినయం అనేది చాలా అరుదుగా అయిపోయింది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎవరెవరు ఎన్ని సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారో ఒకసారి మనం తెలుసుకుందాం…

ఎన్టీఆర్

ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాలో కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.

కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో అగ్రహీరోగా వెలుగొందాడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత ఆ రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ అనే చెప్పాలి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. కుమార్ రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొబ్బిలిదొర వంటి దాదాపు ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
ముగ్గురు మొనగాళ్లు

మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో మొదట విలన్ వేషాలు వేస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు అనతికాలంలోనే మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు ఆయన నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది…

సూర్య

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన సినిమా 24 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటించి తన నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు హీరోగా విలన్ గా నటించి నటన పరంగా అద్భుతంగా నటించారని చెప్పాలి. ఈ సినిమాకి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి…

కమల్ హాసన్

కమల్ హాసన్ నటన పరంగా ఇండియాలోనే గొప్ప నటుడు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే తను ఏ పాత్రలో నటించిన ఆ పాత్ర కి అనుకూలంగా మారిపోయి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తూ ఉంటాడు అందులో భాగంగానే విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామ రాజు లాంటి సినిమాల్లో త్రిపాత్రాభినయం చేస్తూ కనిపించాడు అయితే దశావతారంలో ఏకంగా 10 క్యారెక్టర్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందాడు…

విజయ్

తమిళ్ లో మంచి గుర్తింపు పొందిన హీరో విజయ్ ఆయన తమిళంలో చేసిన ఒక సినిమా తెలుగులో అదిరింది గా డబ్ అయింది ఆ సినిమాలో ఏకంగా 3 పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు… ఇలా తెలుగులో మన హీరోలు మూడు పాత్రలు అంతకంటే ఎక్కువ పోషించిన సినిమాలు చాలానే ఉన్నాయి…

Tags

Related News