Prabhas : ప్రభాస్ దారిలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.

Prabhas : భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అని చాలా ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన భాష ఆ ఇండస్ట్రీకి సెపరేట్‌గా ఉంటుంది. ఆయా ఇండస్ట్రీస్‌లో హీరోలు సినిమాలు చేస్తూ ఆ ప్రాంతంలో అభిమానులను సంపాదించుకుంటారు. వారు ఒకవేళ వేరే ప్రాంతానికి వెళితే అక్కడ అంతగా అభిమానులుండే పరిస్థితులు అంతలా ఉండబోవు. కానీ, ప్రజెంట్ ట్రెండ్ మారింది. టాలీవుడ్ హీరోలు ఒకరిని చూసి మరొకరు […].

By: jyothi

Published Date - Wed - 24 November 21

Prabhas : ప్రభాస్ దారిలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.

Prabhas : భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అని చాలా ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన భాష ఆ ఇండస్ట్రీకి సెపరేట్‌గా ఉంటుంది. ఆయా ఇండస్ట్రీస్‌లో హీరోలు సినిమాలు చేస్తూ ఆ ప్రాంతంలో అభిమానులను సంపాదించుకుంటారు. వారు ఒకవేళ వేరే ప్రాంతానికి వెళితే అక్కడ అంతగా అభిమానులుండే పరిస్థితులు అంతలా ఉండబోవు. కానీ, ప్రజెంట్ ట్రెండ్ మారింది. టాలీవుడ్ హీరోలు ఒకరిని చూసి మరొకరు పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తున్నారు. అయితే, ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయడం ప్రభాస్ దగ్గరి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.


‘బాహుబలి’ ఫిల్మ్ తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇన్‌ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి.. బిగినింగ్, కంక్లూషన్’ సినిమాలు చూసి ప్రభాస్‌ను చాలా మంది ఇష్టపడ్డారు. కాగా, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత.. తన నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్‌లో చేస్తున్నాడు. ‘సాహో’ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రిలీజ్ కాగా, నెక్స్ట్ లైనప్ మొత్తం పాన్ ఇండియా వైడ్ సినిమాలు కావడం విశేషం.


prabhas

prabhasఇకపోతే ప్రభాస్ బాటలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు పయనిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్.. ఇలా ఒకరి తర్వాత మరొకరు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. కాగా, వారు తర్వాత చేయబోయే చిత్రాలు కూడా పాన్ ఇండియా ఫిల్మ్స్ కావడం విశేషం.


Prabhas

Prabhasరామ్ చరణ్ నెక్స్ట్ మూవీ జీనియర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కతోంది. ఈ సినిమా ‘ఆర్‌సీ 15’ పాన్ ఇండియా చిత్రం, కాగా, నెక్ట్స్ ఫిల్మ్ స్పోర్ట్స్ డ్రామా పాన్ ఇండియా వైడ్‌గా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంతో నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.


ram charn same as prabhas releasing his movie pan india

ram charan same as prabhas releasing his movie pan indiaఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ డైరెక్షన్‌లో ‘హరి హర వీరమల్లు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నారు. ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. మాస్ మహారాజ రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ పూర్తి చేసింది. మొత్తంగా టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా స్టార్స్ కాబోతున్నారని చెప్పొచ్చు.


pawan kalyan pan inidan movie in the same path of prabhas

pawan kalyan pan inidan movie in the same path of prabhas

pusha release in 5 languages same in direction of prabhas

pusha release in 5 languages same in direction of prabhas

Tags

Related News