Genelia: బక్కపలుచని అందంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన హీరోయిన్ జెనీలియా అందరికీ సుపరిచితురాలే. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్‌తో హ్యాపీ, మంచు విష్ణుతో ఢీ, చెర్రీతో ఆరెంజ్, రామ్‌తో రెడీ వంటి సినిమాలు చేసి ఇక్కడి ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఒక్క తెలుగులోనే కాకుండా మళయాళ, కన్నడ, హిందీలోనూ పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు.. అనుకోకుండా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
జెనీలియా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఓ స్టార్ హీరో తనయుడు ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడట.. ఆమె జస్ట్ స్నేహంగా భావిస్తే అది ప్రేమ అని చనువు తీసుకోవడానికి ప్రయత్నించాడట..చాలా సార్లు ఓపికగా ఉన్నజెనీలియా ఒక్కసారిగా సహనం కోల్పోయిందట.. దీంతో అతని చెంప చెల్లుమనిపించిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి.
జెనీలియా ఇండస్ట్రీలో చాలా అల్లరి పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. అందరితో క్లోజ్‌గా ఉండే జెనీలియా అనుకోకుండా బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడింది. వీరిద్దరూ కలిసి హిందీలో ఓ సినిమా చేశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య లవ్ పుట్టిందని టాక్. అనంతరం పెద్దలను ఒప్పించుకొని హుందాగా వివాహం చేసుకున్నారు.
ఇకపోతే పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన జెనీలియా కుటుంబాన్ని చూసుకునే పనిలో నిమగ్నమైంది. తన భర్త ఇప్పటికీ హిందీలో సినిమాలు చేస్తున్నాడు. అయితే, ఇండస్ట్రీలో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించాలని జెనీలియా భావిస్తోందట. త్వరలో కన్నడ ఇండస్ట్రీలో మరోసారి మెరవనుందని టాక్ వస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా తెరకెక్కే ఓ సినిమాలో జెనీలియా కనిపించనుందని తెలుస్తోంది.
Also Read : Baladitya wife: బిగ్ బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్
Also Read : Rashmika Mandanna : బిగ్ షాకింగ్.. రష్మికకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో జాయిన్..!