Tollywood Heroes: ఒక్క సినిమాకి టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా…?

Tollywood Heroes: ప్రస్తుతం బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది మారిపోయింది ఇప్పుడు మన వాళ్లు తీసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి దాని కోసం మన హీరోలు కూడా వాళ్ల రెమ్యునరేషన్ ని భారీగా పెంచారు ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల రెమ్యునిరేషన్ లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం… ప్రభాస్ బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ వైజ్ […].

By: jyothi

Published Date - Tue - 31 August 21

Tollywood Heroes: ఒక్క సినిమాకి టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా…?

Tollywood Heroes: ప్రస్తుతం బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది మారిపోయింది ఇప్పుడు మన వాళ్లు తీసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి దాని కోసం మన హీరోలు కూడా వాళ్ల రెమ్యునరేషన్ ని భారీగా పెంచారు ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల రెమ్యునిరేషన్ లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం…

ప్రభాస్
బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ వైజ్ గా పాపులర్ అయింది ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రభాస్ ఒక సినిమా కోసం 70 నుంచి 80 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తుంది…
పవన్ కళ్యాణ్
వకిల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రీ ఎంట్రీ లో పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ భారీగానే ఇస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఒక సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యూనరేషన్ 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది…

మహేష్ బాబు
సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రంగా పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా కోసం మహేష్ బాబు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు…

ఎన్టీఆర్
అరవింద సమేత సమయంలో 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా కోసం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకున్నాడు ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి…

రామ్ చరణ్
రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అలాగే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ కోసం 40 కోట్ల వరకు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది అలాగే ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు రామ్ చరణ్…

చిరంజీవి
చిరంజీవి రీ ఎంట్రీ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సైరా రెండు సినిమాలు కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేశాడు ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా కోసం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని వినికిడి…

అల్లు అర్జున్
అల్లు అర్జున్ అలా వైకుంఠ పురం లో సినిమా కోసం 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం పుష్ప 2 పార్ట్స్ కోసం 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వినికిడి…

వీళ్లతో పాటు సీనియర్ హీరోలు అయిన నాగార్జున,వెంకటేష్ ,బాలకృష్ణ లాంటి హీరోలు కూడా పది కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తుంది అలాగే నాని, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు కూడా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ వాళ్ల స్థాయి మేరకు వాళ్లు సినిమా లో రాణిస్తున్నారని చెప్పవచ్చు…
గోపీచంద్, శర్వానంద్, నితిన్ లాంటి హీరోలు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఒక మంచి సినిమా పడితే వల్ల రెమ్యూనరేషన్ కూడా పెంచి ఆలోచనలో ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఒక రకంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రావడంతో హీరోల రెమ్యున రేషన్ కూడా భారీగానే పెరిగాయి ఎందుకంటే తెలుగు నుంచి వేరే భాషల వారు మంచి సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు తీయడానికి మాత్రమే ముందుకొస్తున్నారు ఇలాంటి సమయాల్లో హీరోలు కూడా తన మార్కెట్ ని పెంచుకోవడానికి సినిమాలు చేస్తూ సినిమాకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేలా చేస్తూ వాళ్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది వాళ్లు కూడా ఎక్కువ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారని తెలుస్తుంది…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News