• Telugu News
  • movies

Jayalalithaa: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆ తర్వాత సీఎంగా ఎదిగిన జయలలిత ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా…?

Jayalalithaa: సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల గా వచ్చి మంచి గుర్తింపు సాధించుకున్న వారు చాలామంది ఉన్నారు అలాగే సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత పొలిటికల్ గా రాణించిన వారు కూడా ఉన్నారు అలాంటివారిలో తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ తనదైన నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకొని ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే సీఎం గా ఎదిగి ప్రజలకు సేవ చేశాడు అలాంటి ఎన్టీఆర్ పేదవాడు ఆకలితో చావకూడదు […].

By: jyothi

Published Date - Tue - 31 August 21

Jayalalithaa: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆ తర్వాత సీఎంగా ఎదిగిన జయలలిత ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా…?

Jayalalithaa: సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల గా వచ్చి మంచి గుర్తింపు సాధించుకున్న వారు చాలామంది ఉన్నారు అలాగే సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత పొలిటికల్ గా రాణించిన వారు కూడా ఉన్నారు అలాంటివారిలో తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ తనదైన నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకొని ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే సీఎం గా ఎదిగి ప్రజలకు సేవ చేశాడు అలాంటి ఎన్టీఆర్ పేదవాడు ఆకలితో చావకూడదు అనే ఉద్దేశంతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడిపించాడు ఇప్పటివరకు కూడా అదే పథకం కొనసాగుతోంది.

 

అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకలించి తనదైన పార్టీ తెలుగుదేశం జెండా ని ఎగిరేలా చేసిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ ఆయన చాలా మంచి పనులు చేసినప్పటికీ చాలామంది ద్వారా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అయితే రాజకీయ పార్టీని స్థాపించి నడిపించేటప్పుడు విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయని వాటిని పట్టించుకోకూడదు అని సీనియర్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు అయితే ఎన్టీఆర్ లాగానే తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్న జయలలిత కూడా సీఎం గా ఎదిగి తమిళనాడు ప్రజలకు తనదైన సేవలను అందించింది తమిళనాడు ప్రజల్లో మంచి గుర్తింపు పొందింది.

జయలలిత పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసింది అలాంటి ఆవిడ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి 1996 లో తను అక్రమ ఆస్తులను సంపాదించింది అనే కేసులో ఆమె పైన విచారణ కూడా జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆమె రెండు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది.18 ఏళ్ల సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో న్యాయస్థానం చివరికి జయలలితను దోషిగా నిర్థారించింది. జయలలిత ఆస్తులను 66 కోట్లుగా న్యాయస్థానం లెక్క
కట్టింది.తిరునెల్వేలి లో 1197 ఎకరాలు
వలాజ పెట్టాలో 200 ఎకరాలు
ఒత్తుకోట లో 100 ఎకరాలు
షిరుత పూర్ లో 25 ఎకరాలు
కాంచీపురం లో దాదాపు 300 ఎకరాలు

ఇలా ఇంకా చాలా ఆస్తులు కలిపి తనకు 66 కోట్ల దాకా ఉన్నాయని విషయాలను వెల్లడిస్తున్నారు అలాగే ఈ ఆస్తులకు వారసులుగా తమిళనాడు హైకోర్టు జయలలిత మేనకోడలు అయిన దీప, మేనఅల్లుడు అయిన దీపక్ లను వారసులుగా ప్రకటించింది. అయితే జయలలిత శశికళ మధ్య చాలా ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని వాటి వివరాలను సరిగా చెప్పట్లేదు అని శశికళ మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి అయితే వీరిద్దరూ కలిసి అప్పట్లో చాలా ఆస్తులను కొనుగోలు చేశారని కానీ వాటి వివరాలు శశికళ తెలియనీయకుండా దాస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది… అయితే ఒక సినిమా సెలబ్రిటీ ఇండస్ట్రీకి వచ్చి తనదైన ముద్రని సాధించి హీరోగా హీరోయిన్ గా ఎదిగి ఇండస్ట్రీ ని వదిలేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది ఈ మధ్య చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు…

Latest News

Related News