Vishwak Sen : విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన్ను అభిమానులు ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యూత్ కు రౌడీ ట్రెండ్ ను అంటించింది మనోడో. ఆ రేంజ్ లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే హీరోల మధ్య కోల్డ్ వార్ ఉండటం సహజమే.
ఇప్పుడు విజయ్ కు మాస్ హీరో విశ్వక్ సేన్ కు మధ్య అప్పుడప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. దీన్ని రౌడీ హీరో పెద్దగా పట్టించుకోవట్లేదు గానీ.. విశ్వక్ మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. గతంలో ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఎవడు పడితే వాడు రౌడీ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేసుకుంటున్నారు. పెద్దగా ట్యాలెంట్ లేకపోయినా లక్ కొద్ది స్టార్లు అవుతున్నారు అంటూ కామెంట్లు చేశాడు విశ్వక్. అప్పట్లో ఈ కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ఎందుకంటే రౌడీ అనే బిరుదును కేవలం విజయ్ మాత్రమే పెట్టుకున్నాడు.
కాబట్టి కావాలనే విజయ్ కు విశ్వక్ కౌంటర్ వేశాడని విజయ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక నేచురల్ స్టార్ నాని కావాలనే విజయ్ కు పోటీగా విశ్వక్ ను దింపాడని అప్పట్లో చాలామంది కామెంట్లు చేశారు. కానీ దానిపై విజయ్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అదే సమయంలో విశ్వక్ కూడా నాని బ్యానర్ లో హిట్ సిరీస్ చేయడం మనం చూశాం.
Read Also : Actress Shirisha : అవకాశాల కోసం చాలామందితో పడుకున్నా.. నటి షాకింగ్ కామెంట్లు..!
Read Also : Natural Star Nani : బ్యాక్ గ్రౌండ్ లేదని తొక్కేస్తున్నారు.. స్టేజ్ మీదనే హీరో నాని సంచలనం..!